Women’s Health : ప్రస్తుతం చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న అనేక అనారోగ్య సమస్యల్లో రుతుక్రమం సరిగ్గా లేకపోవడం కూడా ఒకటి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. హార్మోన్ల ప్రభావం, అధికంగా బరువు ఉండడం.. ఇందుకు ప్రధాన కారణాలు. దీంతో చాలా మంది మహిళలకు నెలసరి సరిగ్గా రావడం లేదు. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే..
1. బొప్పాయి పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. దీన్ని రోజూ తినడం వల్ల శరీరంలో రక్తం పెరగడంతోపాటు జీర్ణ సమస్యలు తగ్గుతాయి. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. అయితే బొప్పాయి పుండు పూర్తిగా పండిపోకుండా కొద్దిగా దోరగా ఉన్నప్పుడు మహిళలు తినాలి. ఇలా తింటుంటే.. వారికి నెల నెలా రుతుక్రమం సరిగ్గా వస్తుంది. అయితే నెలసరి సమయంలో దీన్ని తినరాదు.
2. రాత్రిపూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని రోజూ తాగడం వల్ల కూడా మహిళల్లో నెలసరి సరిగ్గా వస్తుంది. రుతుక్రమం సరిగ్గా అవుతుంది. పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి కనుక మహిళలకు నెలసరి సమస్య తొలగిపోతుంది.
3. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక టేబుల్ స్పూన్ మోతాదులో కలబంద గుజ్జును తింటుండాలి. దీంతో రుతు క్రమం సరిగ్గా ఉంటుంది. అంతేకాదు, నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. అయితే నెలసరి అయినప్పుడు మాత్రం ఈ గుజ్జును తీసుకోకూడదు.
4. చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అనంతరం వచ్చే నీటిలో చక్కెర లేదా తేనె కలుపుకుని తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు భోజనం చేశాక తాగాలి. దీంతో రుతు సమస్యలు పోతాయి. రుతు క్రమం సరిగ్గా అవుతుంది. హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి.
5. రెండు టీస్పూన్ల జీలకర్రను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే జీలకర్రను తీసేసి ఆ నీటిని పరగడుపునే తాగాలి. దీనివల్ల రుతు సమస్యలు పోయి రుతుక్రమం సరిగ్గా అవుతుంది.
6. ఒక గ్లాస్ వేడి పాలలో 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలిపి తాగాలి. ఇలా రోజూ తాగుతుంటే కొద్ది రోజులకు నెలసరి సక్రమంగా వస్తుంది.
7. కపాలభాతి అనే ప్రాణాయామ పద్ధతిని పాటిస్తే రుతు సమస్యలు పోతాయి. రుతుక్రమం సరిగ్గా ఉంటుంది. దీన్ని ఉదయాన్నే పరగడుపునే చేయాల్సి ఉంటుంది. గాలిని వేగంగా లోపలికి పీలుస్తూ వదులుతూ 5 నిమిషాల పాటు చేయాలి. దీన్ని ఒక ఆవృతం అంటారు. అలాంటి ఆవృతాలు 3 చేస్తే చాలు. అంటే 15 నిమిషాల పాటు దీన్ని రోజూ చేయాలి. 5 నిమిషాలకు ఒకసారి గ్యాప్ ఇవ్వాలి. ఈ కపాలభాతి ప్రాణాయామం చేస్తే రుతు సమస్యలే కాదు, ఇంకా అనేక సమస్యలు పోతాయి. అనారోగ్యాల నుంచి బయట పడవచ్చు.