భారత దేశంలో నే ఒక ప్లాన్ ప్రకారం భూములు భవనాలపై ముందు చూపుతో పెట్టుబడి పెట్టిన హీరో శోభన్ బాబు. అందరికంటే అధికంగా సంపాదించారని చెపుతారు. ఎక్కడో కృష్ణా జిల్లాలో మారుమూల పల్లెలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన టనపై మక్కువతో మద్రాసు చేరి అక్కడే పట్టుదల వీడకుండా మంచి నటుడుగా పేరు పొంది, దానితో పాటే సిస్టమాటిక్ గా money ని జాగ్రత్త చేసి పెట్టుబడులు పెట్టారు. నగరంలో కనీసం 50 భవ నాలు శోభన్ వారసుల కి వచ్చాయని, నగరం చుట్టు పక్కల వందలు కాదు వేల ఎకరాల భూములు ఉన్నాయని అంచనా, వీటి ప్రస్తుత విలువ 50–60 వేల కోట్ల పైనే అని టాక్!
తనకు సరిపడని చిత్ర నిర్మాణం, దర్శకత్వం, స్టూడియోల వంటి జోలికి పోకుండా కష్టార్జితం మొత్తాన్ని అత్యంత నైపుణ్యంతో పెంచి పెద్ద చేసిన శోభన్ బాబుకి సాటి రాగల సంపన్నలు దేశ చలన చిత్ర రంగంలో నే లేరని తెలుగు సినీ వర్గాలు చెబుతుంటాయి. మరో విశేషం …చెన్నైలో ఏ తెలుగు ప్రముఖుడిపై లేనంత grudge అంటే వ్యతిరేకత లేదా అసూయ స్థానిక తమిళ పేద సాదల్లో శోభన్ పై గూడు కట్టుకుని ఉందని కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఉదంతం చెప్పుకోవచ్చు. అదే మంటే 6–7 సం. ల క్రితం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలోని అడవుల్లో red sander అంటే ఎర్ర లేదా రక్త చందనం smuggling నిరో దించడానికి task force పోలీసులు చీకట్లో తమకు ఎదురు పడిన స్మగ్లర్ల బృందాన్ని encounter చేశారు, వారంతా పాపం పేద తమిళ యువకులు, 14 మంది చనిపోయారు, దీనిపై ఏపీ పోలీసులు తమ వెర్షన్ తాము చెప్పి సమర్థించుకున్నారు!
అయితే దీని ప్రకంపనలు చెన్నైలో వచ్చాయి, నగరంలోని శోభన్ ఇంటి junction పాద బాటపై నెల కొల్పిన ఆయన Full size కాంస్య విగ్రహాన్ని ఆందోళన కారులు పడగొట్టి కోపం ప్రదర్శించారు, తెలుగు పోలీసులపై వ్యక్తమైన ఆగ్రహం అది. చెన్నై పానగల్ పార్కులో చిత్తూరు నాగయ్య విగ్రహం ఉంది, నగరంలో మరికొన్ని Telugu వారి ప్రతిమలు ఉన్నాయి, వాటిని ఏమీ చేయలేదు! సంపన్ను డైన శోభన్ పై మాత్రమే వారి దృష్టి పడింది, తమిళనాడు ప్రభుత్వం వారికి సర్ది చెప్పి శాంతింప జేసింది! శోభన్ విగ్రహం ఇక అక్కడ ఉండటం క్షేమకరం కాదని తలచి ఆయన కుటుంబం వారు, అభిమానులు దాన్ని పదిలంగా విజయవాడ చేర్చి తుమ్మల పల్లి కళా క్షేత్రంలో పునః ప్రతిష్ఠ చేశారు! శోభన్
ఆస్తుల నిర్వహణకు చెన్నయ్ లో 20–30 మంది మేనేజర్లు పని చేస్తుంటారు!సీనియర్ నటుడు చంద్రమోహన్ , శోభన్ బాబు ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన వారు. ఆత్మీయ మిత్రులు, చంద్ర మోహన్ కి ఇద్దరూ ఆడ పిల్లలే, శోభన్ కి ఒక కుమారుడు ఉన్నారు, శోభన్ మాదిరే తనకు కూడా ఒక కొడుకు ఉండి ఉంటే ఆస్తుల విషయంలో ఆయనతో పోటీ పడే వాడినని, శోభన్ తన వారసుడికి అన్నీనేర్పించి భారీ ఆస్తులు సంపాదించారని చెప్పే వారు.