నందమూరి తారకరత్న గతంలో యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఆయన పరిస్థితి సీరియస్ అవడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్సను అందించారు. కానీ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే నందమూరి కుటుంబానికి చెందిన వాళ్లకు వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడం హాట్ టాపిక్ అవుతుంది. 2009 సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ కు కారు ప్రమాదం జరగగా, ఆ ప్రమాదంలో తారక్ తీవ్రగాయాల పాలయ్యారు.
ఆ సమయంలో తారక్ ఆసుపత్రి నుంచి ఎన్నికల ప్రచారం చేయడం గమనార్హం. హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ 2014 సంవత్సరంలో కోదాడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 2018 సంవత్సరం ఆగస్టు నెలలో హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గతంలో నందమూరి రామకృష్ణ రోడ్డు ప్రమాదంలో గాయాల పాలు కావడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నందమూరి కుటుంబానికి ఏదైనా శాపం తగిలిందా? అందువల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
నందమూరి కుటుంబ సభ్యులు ఒకసారి జ్యోతిష్యులను సంప్రదిస్తే మంచిదని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఈ కామెంట్ల విషయంలో జ్యోతిష్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. నందమూరి హీరోలకు క్రేజ్ ఊహించని రేంజ్ లో పెరుగుతుండగా, నందమూరి స్టార్స్ మరెన్నో సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నందమూరి హీరోలకు సినిమాల పరంగా జీవితం బాగానే ఉన్నా, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం గమనార్హం.