నేటి రోజుల్లో చాలామందికి వెన్ను నొప్పి సాధారణమైపోయింది. అందులోనూ, కార్యాలయాలలో కూర్చొని ఉద్యోగాలు చేసే వారిలో అధిక శాతం వెన్ను నొప్పితో బాధపడుతూనే వుంటారు. అధిక సమయం తమ కుర్చీలలో కూర్చొని ఉద్యోగ, వ్యాపారాలను నిర్వహించలేకుండా వున్నారు. ఇటువంటివారు తమ వెన్ను నొప్పి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్ని ఇస్తున్నాం. పరిశీలించండి.
వెన్ను నొప్పి నివారణకు విశ్రాంతి తీసుకోవడం చక్కని పరిష్కారం. పడకపై వెల్లకిలా పడుకొని, మీ మెడ క్రింద ఒక తలగడ వుంచి ఒక రాత్రంతా హాయిగా నిద్రిస్తే చాలు వెన్ను నొప్పి మటుమాయమవుతుంది. నొప్పి కలిగే వీపు భాగానికి చల్లటి ఐస్ ముక్కలతో తాకిడి కలిగించండి. ఎంతో ఊరట కలుగుతుంది.
వెల్లకిలా పరుండి మీ మోకాళ్ళను ఛాతీ వద్దకు వంచటం, మరల సాధారణ స్ధితికి చేరటం వంటి వ్యాయామాలు వెన్ను నొప్పికి బాగా పనిచేస్తాయి. ఎపుడు బరువు ఎత్తినా సరే మీ మోకాళ్ళపై ముందుగా వంగండి. దీనితో మీ వీపు క్రింది భాగంపై ఒత్తిడిపడి వెన్నెముక కండరం బలహీనపడకుండా వుంటుంది.