కొన్ని పోషకాహారాలు రోగాలను నయంచేసే గుణాలు కూడా కలిగి వుంటాయి. బెర్రీలు, బీన్స్, బ్రక్కోలి వంటివి సూపర్ ఆహారాలుగా చెప్పవచ్చు. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేరిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు పరిష్కరించవచ్చు. అవేమిటో కొన్ని చూడండి. చెర్రీలు – కడుపులో మంట, కేన్సర్, కీళ్ళనొప్పులు, గౌట్, వంటి వ్యాధులకు రుచికరమైన ఆరోగ్యకరమైన చెర్రీ పళ్ళు బాగా నివారణనిస్తాయి. వీటిని అలానే తినేయవచన్చు లేదా పెరుగు, ఓట్ మీల్ వంటి వాటిలో కలిపి తినవచ్చు. జామ కాయ లేదా పండు – ఎంతో రుచి, రోగ నివారణలో అద్భుతం. పుష్కలమైన విటమిన్- సి వుంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నివారిస్తాయి. గుండె, పక్షవాతం వ్యాధులు రాకుండా చేస్తుంది. ఎర్రటి జామ పండ్లు, తెల్లవాటికంటే మంచి ఆరోగ్యం.
బీన్స్ – బీన్స్ పీచు వున్న మంచి పోషకాహారం. ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా వుంటాయి. రక్తంలోని షుగర్ స్ధాయి నియంత్రిస్తుంది. విషాహారానికి విరుగుడు, నిద్ర లేమి, డయేరియా, రక్తపోటు వంటివాటికి నివారణ. కివి పండ్లు – కివి పండ్లలో విటమిన్లు, పొటాషియం అధికం. గుండెజబ్బులు, శ్వాససంబంధిత సమస్యలు, పక్షవాతం వంటివి రాకుండా చేస్తాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కివి పండ్లు గుండె జబ్బులు రాకుండా చేస్తాయి.
బచ్చలి కూర – ఎన్నో విటమిన్లు కల మంచి పోషకాహారం. గుండె జబ్బులు, మతిమరపు వంటి వాటికి బాగా పనిచేస్తుంది. విటమిన్ కె వుంటుంది. కాల్షియం అధికంగా వుండి ఎముకలు గట్టిపరుస్తుంది. ఈ ఆకు కూర సంవత్సరం పొడవునా లభిస్తూనే వుంటుంది.