ప్రధానంగా మన ఇంట్లో వంట చేసుకోవడానికి అల్యూమినియం పాత్రలను ఉపయోగిస్తాం. ఇవి వాడుతున్న కొలది చాలా జిడ్డుగా తయారవుతాయి. అంతే కాకుండా ఇవి నల్లగా మారడం ప్రారంభమవుతాయి. దీంతో ఆ పాత్రలను వాడటం మానేస్తారు. ఇక అలాంటి వాటికి మనం చెక్ పెట్టాలంటే.. మన ఇంట్లో ఉండే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. కానీ ప్రస్తుత కాలంలో అల్యూమినియం వాడకం తగ్గిన, కొన్ని వంటకాలు మాత్రం తప్పనిసరి అయిపోయింది. ముఖ్యంగా కుక్కర్లు, పాన్లు, కడాయిలు, వంటి పాత్రల్లో కొన్ని రుచికరమైన వంటకాలు చేయడానికి ఉపయోగిస్తారు. ఇలా వాడుతున్న కొద్దీ అవి నల్లబడటం ప్రారంభం అవుతుంది. ఈ తరుణంలో ఈ చిట్కాలు పాటించండి. ముఖ్యంగా అల్యూమినియం పాత్రలో కూరగాయలు వండినప్పుడు అది చాలా జిడ్డుగా తయారవుతుంది. వస్తువుపై నల్లటి పొర రావటం మొదలవుతుంది.
ముందుగా పాన్ ను వేడి చేసి అందులో మూడు నుంచి నాలుగు గ్లాసుల నీటిని మరిగించాలి. దీని తర్వాత రెండు టీ స్పూన్ల సర్ఫ్, ఒక టీస్పూను ఉప్పు, నిమ్మరసం వేసి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత ఈ వేడి నీటిని తీసివేసి స్కబ్బర్ తో రాస్తే అంతా పోతుంది. బేకింగ్ సోడా అనేది పాన్ నలుపు పోగొట్టడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. దీంట్లో కూడా కాస్త సర్ఫ్ కలిపి, రెండు మిక్స్ గా రుద్దడం ద్వారా దాని మీద ఉండే నలుపు తొలగిపోయి పాన్ కొత్త దానిలా కనబడుతుంది.
ఒక్కొక్కసారి కడాయి జిడ్డు ఉండడమే కాకుండా చాలా మాడిపోయి నల్లగా తయారవుతుంది. ఇలాంటి సమయంలో ఒక టీ స్ఫూన్ బేకింగ్ సోడా, రెండు టీ స్పూన్ల నిమ్మరసంతో కలిపి, గోరువెచ్చని నీటితో రాస్తే కడాయి తళతళ మెరుస్తుంది.