కమలహాసన్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో నటుడిగా ఈయనకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. కానీ కమలహాసన్ హీరోయిన్లు, తన పెళ్లిళ్ల విషయంలో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. కమల్ హాసన్ మొదట భార్య పేరు వాణి గణపతి. ఈమెతో పెళ్లి జరిగిన కొద్ది రోజులకు వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా వాణి గణపతికి విడాకులు ఇచ్చిన తర్వాత తిరిగి కమల్ హాసన్ సారికను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు అనే సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల తర్వాత వీరిద్దరూ కూడా విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇలా కమల్ హాసన్ రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భార్యలకు దూరమైనప్పటికీ పలువురు హీరోయిన్లతో రిలేషన్ కూడా మెయింటెన్ చేశారు. అయితే కమల్ హాసన్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కమల్ హాసన్ సీనియర్ స్టార్ హీరోయిన్ రేఖతో కూడా గతంలో రిలేషన్ లో ఉన్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఒక నేషనల్ వెబ్ సైట్ కథనం ప్రకారం యష్ చోప్రా దర్శకత్వంలో సిల్సిలా అనే సినిమాలో రేఖ నటిస్తున్నారట. అదే సమయంలోనే 1981లో కమల్ హాసన్, శ్రీదేవిలతో కలిసి మీండుం కోకిల అనే తమిళ చిత్రానికి కూడా సంతకం చేసింది. నివేదికల ప్రకారం, కమల్, రేఖ షూటింగ్ సమయంలో రిలేషన్ పెంచుకున్నారని వార్తలు బయటకు వచ్చాయి.
ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్న సమయంలోనే కమల్ హాసన్ భార్య వాణి గణపతి అనుకోకుండా వీరు బస చేస్తున్న హోటల్ కి వెళ్లారట. ఆ సమయంలో కమల్ హాసన్ తో పాటు నటి రేఖ కూడా ఉండటం ఆమె స్వయంగా చూసినట్టు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ విధంగా కమల్ హాసన్ నటి రేఖతో కలిసి ఒకే గదిలో కనిపించడంతో ఈ సినిమా నుంచి నటి రేఖను తప్పించి ఆమె స్థానంలో మరో మలయాలీ నటి దీపను ఈ ప్రాజెక్టులో తీసుకున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి ఇటు కమల్ హాసన్ గాని అటు రేఖ గాని ఎక్కడ స్పందించలేదు.
ఇలా ఈ ఘటన జరిగిన సమయానికి కమల్ హాసన్, వాణి గణపతి విడాకులు తీసుకోలేదని తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు రావడంతోనే కమల్ హాసన్ వాణి గణపతి విడాకులు తీసుకున్నట్టు సమాచారం. ఇలా విడాకుల తర్వాత ఈయన నటి గౌతమితో కూడా కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేసిన విషయం తెలిసిందే. హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన సినిమాలలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన కమల్ హాసన్ హీరోయిన్ల విషయంలో మాత్రం తరచూ వివాదాలలో నిలుస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం ఈయన రాజకీయాలపై అలాగే సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి బిజీగా ఉన్నారు.. ఇక ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన థగ్ లైఫ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.