డస్సాల్ట్ ఏవియేషన్ చైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్ ఇటీవలే భారత్ తమ రఫేల్ యుద్ధ విమానాలలో ఒకదాన్ని కోల్పోయినట్లు బహిరంగంగా ధ్రువీకరించారు. ఈ నష్టం శత్రు దాడులు లేదా యుద్ధపరిస్థితుల కారణంగా కాదు, వాస్తవానికి ఇది అధిక ఎత్తులో (12,000 మీటర్లకు పైగా) జరిగిన శిక్షణ ప్రమాదం. సాంకేతిక వైఫల్యం కారణంగా విమానం కూలిపడినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి కారణాలను గుర్తించడానికి తాత్కాలిక దర్యాప్తు జరుగుతోంది. పాకిస్థాన్ చేసిన 6 భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేసిన దావాలను భారత ప్రభుత్వం ఎప్పుడూ అధికారికంగా అంగీకరించలేదు. జూన్ 2025లో సింగపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో CDS జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్-పాక్ మధ్య సంఘర్షణలలో IAF కొన్ని నష్టాలను ఎదుర్కొంది. ఆయన ఎన్ని విమానాల నష్టమో ఖరారు చేయలేదు.
భారత్-పాక్ ఘర్షణ తర్వాత, చైనా ఉద్దేశపూర్వకంగా రఫేల్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ప్రచారం ప్రారంభించింది. చైనా రాయబార కార్యాలయాల్లోని రక్షణ అటాచీలు ప్రపంచవ్యాప్తంగా రఫేల్‌లు యుద్ధక్షేత్రంలో విఫలమయ్యాయి అనే అబద్ధాన్ని వ్యాప్తి చేయడం ప్రారంభించారు. రఫేల్ ఎగుమతులను నాశనం చేయడం, దాని స్థానంలో చైనా J-20 స్టెల్త్ ఫైటర్‌ల అమ్మకాలను ప్రోత్సహించడం. ఫ్రాన్స్ దీనిని ఆర్థిక యుద్ధానికి సమానమైన చర్యగా నిందిస్తోంది. 2025 ప్రారంభంలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారతం ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు చేశారు. ఖచ్చితమైన ఎయిర్ స్ట్రైక్‌ల ద్వారా 100కు పైగా ఉగ్రవాదుల సంహారం చేశారు. భారత సైనిక స్థావరాలపై క్రూజ్ మిసైల్ దాడులు చేసినా పాక్ ఏమీ చేయలేకపోయింది. వాటిని భారత్ తిప్పికొట్టింది. రఫేల్ ఘటన జరిగిన రోజుల్లోనే భారత్ సముద్ర రక్షణను బలోపేతం చేయడానికి ప్రొజెక్ట్-75(I)ను ఆమోదించింది. ఈ రఫేల్ ఘటన సాంకేతిక దురదృష్టంని తెలియజేస్తుంది, కానీ భారత-ఫ్రెంచ్ సైనిక భాగస్వామ్యం, రఫేల్‌ల సామర్థ్యం ఏమాత్రం తగ్గలేదు. భవిష్యత్తులో భారత ఆకాశాన్ని రఫేల్‌లే కాకుండా తేజస్, AMCA లాంటి స్వదేశీ విమానాలు కూడా రక్షిస్తాయి!