మన శరీరంలో ఉన్న అవయవాల్లో కాలేయం అనేది చాలా సున్నితమైన అవయవం. శరీరంలో చాలా పనులను కాలేయం నిర్వహిస్తుంది. ముఖ్యంగా హానికరమైన పదార్థాలను బయటకు పంపడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కార్బోహైడ్రేట్, ప్రోటీన్లు, కొవ్వులను విచ్చినం చేస్తుంది. ఖనిజ లవణాలు వంటి ముఖ్యమైన పోషకాలను నిల్వ చేస్తుంది. రక్తం గడ్డ కట్టడంలో సహాయపడే ప్రోటీన్ లను ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి పనులు చేసే కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. మరి ఈ ఫ్యాటీ లివర్ సమస్య వచ్చినప్పుడు కనబడే లక్షణాలు ఏంటో చూద్దాం.
ఈ ఫ్యాటీ లివర్ శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది. అంటే మీ శరీరం ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించదు. ఇది అదనపు ఇన్సులిన్ ఏర్పడడానికి అకాంతోసిస్ నైగ్రికన్స్ అనే చర్మ సమస్యకు దారితీస్తుంది. దీనివల్ల చర్మం మడతలు పడడం, నల్లటి చారలు రావడం ఏర్పడుతుంది. శరీరంలో కాలేయం దెబ్బతినడం వల్ల తగినంత ప్రోటీన్ ను ఉత్పత్తి చేయలేదు. దీని ఫలితంగా శరీరంలో వివిధ అవయవాలకు రక్త ప్రసరణ వ్యర్థాలు తొలగింపులో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇది మీ యొక్క ముఖంలో వాపును కలిగిస్తుంది ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది.
ఫ్యాటీ లివర్ వ్యాధిని కలిగి ఉన్నప్పుడు శరీరం జింకు వంటి పోషకాలను సమర్ధవంతంగా గ్రహించలేకపోవచ్చు. ఈ లోపం వల్ల చర్మంలో వేడి మంట కు కారణమవుతుంది. దీనివల్ల తరచుగా నోటి చుట్టూ దద్దుర్లు రావడం గడ్డలు ఏర్పడడం జరుగుతుంది. ఫ్యాటీ లివర్ వ్యాధి ముఖంతో సహా చర్మంపై కూడా దురద కలుగుతుంది. ఈ దురద శరీరంలో పిత్త లవణాలు అధికంగా ఉండటం వల్ల వస్తుంది. గోకడం వల్ల దురద తగ్గకపోగా మరింత తీవ్రతరం చేస్తుంది. ఇక దురద తరచుగా వస్తూ ఉంటే ఫ్యాటీలివర్ సమస్య ఉన్నట్టే.