తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో గుర్తింపు ఉంది. కానీ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీని నందమూరి కుటుంబం దూరం పెట్టింది. దీంతో ఎన్టీఆర్ ఎంతో కష్టపడి సినిమాల్లో రాణిస్తూ స్టార్ డం తెచ్చుకున్నారు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారారు.. నందమూరి తారక రామారావు పేరు నిలబెట్టిన స్థానంలో ఎన్టీఆర్ ఉంటారని చెప్పవచ్చు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఒక విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.. అదేంటో చూద్దాం.. ఆర్ఆర్ఆర్ మూవీని తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక థియేటర్లో చూసామని అన్నారు.
ఈ సమయంలో అమ్మ దూరంగా వేరే వరుసలో కూర్చుంది. నా ఇంట్రడక్షన్ సీన్ చూసి దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. పక్కనే కూర్చుని నా చేయి పట్టుకుని సినిమా చూసింది. ఆ ఫీలింగ్ నేనెప్పటికీ మర్చిపోలేను అని చెప్పాడు. అంతేకాదు తన కొడుకు అభయ్ రామ్ గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. అభయ్ రామ్ కొడుకు కాదు క్వశ్చన్ బ్యాంక్. వాడికి ఏదైనా కనిపిస్తే చాలు వెంటనే ప్రశ్నలు వేస్తుంటాడు. వాటన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెబుతా అన్నారు. ఒక్కొక్కసారి వాడేం అడుగుతాడో అన్న భయం వేస్తుంది.
అందుకే వాడిని చూసి పారిపోతానంటూ, ఆ సమయంలో ప్రణతి వాడికి బలైపోతుందని సరదాగా చెప్పుకొచ్చారు తారక్. నా వివాహానికి ముందు తాను హైపర్ గా ఉండేవాడినని, అలాంటి నన్ను లక్ష్మీ ప్రణతి చాలా మార్చేసింది అని చెప్పారు. అందుకే నా భార్య అంటే నాకు చాలా ఇష్టమని, ఆమె మా ఇంటి హోమ్ మినిస్టర్ అని తెలిపారు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలా బాగుంటుందని రెండోసారి అమ్మాయి పుడుతుందని అనుకున్నారని కానీ మళ్ళీ అబ్బాయే పుట్టారని తెలిపారు.