Fenugreek Seeds Water : మెంతులను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వంట ఇంటి పోపు దినుసుగా ఉపయోగిస్తున్నారు. మెంతులను రోజూ వంటల్లో వేస్తుంటారు. అలాగే వీటిని పచ్చళ్లలో ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక మొండి వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చు. మెంతుల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతులను గుప్పెడు మోతాదులో తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని అలాగే మరిగించాలి. అవసరం అయితే అందులో కాస్త నీటిని పోయవచ్చు. ఆ నీటిని కప్పు మోతాదులో ఉదయాన్నే పరగడుపునే తాగాల్సి ఉంటుంది. దీంతో అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు.
1. మెంతులను రోజూ ఖాళీ కడుపుతో తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ నీళ్లను ఒక నెల రోజుల పాటు ఉదయం పరగడుపునే తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
2. మెంతుల నీళ్లను రోజూ పరగడుపునే నెల రోజుల పాటు తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
3. జీర్ణ సమస్యలు ఉన్నవారు మెంతుల నీటిని తాగితే ప్రయోజనం ఉంటుంది. నెల రోజుల పాటు ఈ నీటిని క్రమం తప్పకుండా తాగితే మలబద్దకం, గ్యాస్, అజీర్ణం సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
4. మెంతుల నీళ్లను తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. శరీరంలో కొవ్వు త్వరగా తగ్గుతుంది. హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు.
5. మెంతుల నీళ్లను నెల రోజుల పాటు తాగడం వల్ల శిరోజాల సమస్యలు, చర్మ సమస్యలు అన్నీ నయమవుతాయి. జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
6. మెంతుల నీళ్లను తాగితే శరీరంలోని వ్యర్థాలు అన్నీ బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.