Kajal Aggarwal : తెలుగుతోపాటు పలు ఇతర భాషలకు చెందిన చిత్రాల్లోనూ నటించిన కాజల్ అగర్వాల్ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈమె ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు. గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నాక ఈమె సినిమాలకు పూర్తిగా దూరమైంది. అప్పటికే చేతిలో ఉన్న సినిమాలను చకచకా పూర్తి చేసింది. ఇక కాజల్ ప్రస్తుతం గర్భవతి. ఈ క్రమంలోనే ఆమె మాతృత్వపు మధుర క్షణాలను ఆస్వాదిస్తోంది.
దుబాయ్‌లో కాజల్ అగర్వాల్ ఇటీవల తన భర్తతో కలిసి విహారానికి వెళ్లింది. ఆ సమయంలో దిగిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే కొందరు నెటిజన్లు ఆమె శరీర ఆకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ కాజల్ అగర్వాల్ వాటికి దీటుగా బదులు చెప్పింది. తల్లి అయ్యాక శరీరంలో ప్రతి మహిళకు మార్పులు వస్తాయని, ఆ మార్పులు తనలోనూ వస్తున్నాయని, వాటి పట్ల ఏమాత్రం దిగులు చెందడం లేదని, మాతృత్వపు మధుర క్షణాలను ఫీల్ అవుతున్నానని చెప్పింది.
అయితే కాజల్ అగర్వాల్‌పై వస్తున్న విమర్శలకు ఆమెకు సమంత, మంచు లక్ష్మి మద్దతుగా నిలిచారు. నువ్వు ఎల్లప్పుడూ అందంగానే ఉంటావు.. అని సమంత కామెంట్ చేయగా.. నువ్వు ప్రతి దశలోనూ పర్‌ఫెక్టే, నీ చుట్టూ చాలా ప్రేమ ఉంది బేబీ.. అని మంచు లక్ష్మి కామెంట్ చేసింది. కాగా కాజల్ అగర్వాల్ చివరిసారిగా నటించిన చిత్రం ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి పక్కన ఆమె హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.