Urfi Javed : బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు సాధారణ సమయాల్లోనూ గ్లామరస్ డ్రెస్సులు వేసుకుని అందాల ప్రదర్శన చేస్తుంటుంది. ఇక బయట ఏవైనా ఈవెంట్లకు వెళితే.. అంతే సంగతులు. ఒక రేంజ్‌లో అందాలను చూపిస్తుంటుంది. ఇక ఈమె తాను ధరించే దుస్తుల కారణంగా ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమెను అందరూ విమర్శిస్తూనే ఉంటారు. అయినప్పటికీ ఆమె తన వస్త్రధారణను మార్చుకోవడం లేదు.
ఇక ఉర్ఫి జావేద్ తాజాగా ధరించిన డ్రెస్ చర్చనీయాంశంగా మారింది. ఈమె చొక్కాను వెనక్కి తిప్పి వేసుకుంది. దీంతో వీపు భాగం మొత్తం కనిపిస్తోంది. ఆ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెను మళ్లీ టార్గెట్ చేశారు.
పాపా.. నీ డ్రెస్సులను నువ్వే డిజైన్ చేసుకుంటున్నా ? లేక ఎవరైనా మహానుభావులు వాటిని కత్తిరించి నీకు ఇస్తున్నారా ? అంటూ నెటిజన్లు ఉర్ఫి జావేద్‌పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయినప్పటికీ ఆమె తనదారిలో తాను వెళ్తూనే ఉంటుంది. ఎవరినీ పట్టించుకోదు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తాను తనకు ఇష్టం వచ్చిన దుస్తులను ధరిస్తారని, ఎవరేమన్నా పట్టించుకోనని చెప్పింది.