Kavya Thapar : మద్యం మత్తులో ఊగి తూగడం, పలు వివాదస్పద అంశాలలో నిలవడం కొందరు భామలకు అలవాటు అయిపోయింది. తాము ఒక సెలబ్రిటీ అనే విషయం కూడా మరచిపోయి తప్పుగా ప్రవర్తిస్తున్నారు.మహారాష్ట్ర హీరోయిన్ కావ్యా థాపర్ ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి మద్యంమత్తులో కారు డ్రైవ్ చేస్తూ.. ఒక వ్యక్తిని గాయపరిచడంతో పాటు.. పోలీసులను దూషించడం, అవమానపరిచింది. దీంతో పోలీసులు ఆమెపై సెక్షన్ 353, 504, 332, 427 ఐపీసీ కింద కేసు నమోదు అరెస్ట్ చేశారు.
కావ్య తాపర్ తన కెరీర్‌ను మోడలింగ్ ద్వారా ప్రారంభించింది. ఎన్నో ఉత్పత్తుల ప్రకటనల్లో నటించింది. అటు నుంచి మెల్లిగా వెండితెరపైకి వచ్చింది. షార్ట్ ఫిల్మ్ తక్తల్‌తో నటిగా కెరీర్‌ను ప్రారంభిస్తే.. ఏక్ మినీ కథ సినిమానే పూర్తి స్థాయి హీరోయిన్‌గా మారింది. మొత్తానికి ఈ చిత్రం ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సంతోష్ శోభన్‌కు, కావ్య తాపర్‌కు ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. ఈ మాయ పేరేమిటో, ఏక్ మినీ కథ చిత్రాలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇలా వివాదస్పదం కావడం అందరికి షాకింగ్‌గా మారింది.
పోలీసులు.. యాక్సిడెంట్ గురించి విచారించే క్రమంలో వారితో వాగ్వివాదానికి దిగింది కావ్యా థాపర్. పలువురు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా ఓ పోలీసు అధికారి కాలర్ను పట్టుకుంది. దీంతో హీరోయిన్ కావ్యా థాపర్ను అరెస్టు చేసిన పోలీసులు.. జుహూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం అమెను అంధేరి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. కోర్టులో వాదనలు విన్న జడ్జి హీరోయిన్ కావ్యా థాపర్ను విచారణ కోసం జ్యూడిషియల్ కస్టడీ విధించారు.