Kajal Aggarwal : ఎవరైనా ఒక హీరో లేదా ఒక హీరోయిన్ ఒక సినిమాలో నటించారు అంటే.. దానికి ప్రచారం కల్పించడం కోసం వారు నానా కష్టాలు పడుతుంటారు. అందుకు గాను అవసరం అయితే ఎక్కడికైనా వెళ్తుంటారు, ఏమైనా చేస్తుంటారు.. ఎవరు ఏం ప్రశ్నలు అడిగినా ఓపిగ్గా సమాధానాలు చెబుతూ ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. నటీనటులు అందులోనూ తమ సినిమాల గురించి ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. ఇక కాజల్ అగర్వాల్ మాత్రం వెరైటీగా ప్రచారం చేసిందనే చెప్పవచ్చు.
కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం.. హే సినామికా.. దుల్కర్ సల్మాన్, అదితి రావు హైదరిలు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ తమిళంలో మార్చి 3వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కాజల్ అగర్వాల్ తన సోషల్ ఖాతాలో పోస్టు పెట్టింది. ప్రస్తుతం తాను గర్భవతి కాగా.. అంతకు ముందు చేసిన ఓ ఫొటోషూట్ తాలూకు ఫొటోలను షేర్ చేస్తూ.. దాని కింద ఈ మూవీ రిలీజ్ డేట్ చెబుతూ ప్రమోషన్ చేసింది.
అయితే సోషల్ మీడియాలో ఇలా సినిమా ప్రమోషన్స్ చేయడం మామూలే. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఓ వైపు ఫొటోషూట్ చేసి.. ఆ ఫొటోలతో ఈ సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఆమె ప్రస్తుతం గర్భంతో ఉంది కదా.. కనుక బయటకు వచ్చి ప్రమోషన్స్‌లో పాల్గొనడం కష్టమే. కానీ సినిమాలోని పోస్టర్స్‌తోనూ ఆమె ప్రమోషన్ చేయవచ్చు. అలా కాకుండా గతంలో దిగిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలతో ఆమె ప్రమోషన్ చేస్తుండడంతో ఆమె భలే తెలివిగా సినిమాను ప్రమోట్ చేస్తుందని అంటున్నారు.
ఇక కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకోగా.. త్వరలో ఆమె బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ మధ్యే ఆమెను బాగా లావైందని ట్రోల్ చేశారు. ఆమె వారికి గట్టిగా సమాధానం చెప్పింది. ఇక ఈమె చిరంజీవి పక్కన ఆచార్య మూవీలోనూ నటించింది. త్వరలోనే ఈ మూవీ కూడా విడుదల కానుంది.