Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

శ‌నీశ్వ‌రుడిని ఇలా పూజిస్తే ఐశ్వ‌ర్యాన్ని ఇస్తాడు..!

Admin by Admin
April 17, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా శనీశ్వరుడి పేరు చెప్పగానే ఉలిక్కి పడతాం. ఆయన పేరు వింటే తెగ ఆందోళన పడిపోతారు. మన జాతకంలో శని ప్రభావం ఉండకూడదని కోరుకుంటాం. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే జనాల్లో ఓ రకమైన వణుకు పుడుతుంది. కానీ శనీశ్వరుడు ప్రసాదించే వాటి గురించి తెలుసుకుంటే ఆయనను తప్పక ఆరాధిస్తారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అంటారు. నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడు, రవిపుత్రం అంటే సూర్యుడి పుత్రుడు, యమాగ్రజం-యముడికి సోదరుడు, ఛాయా మార్తాండ సంభూతం. ఛాయా దేవికి మార్తాండుడు అంటే సూర్య భగవానుడికి జన్మించిన వాడు, తం నమామి శనేశ్చరం. అలాంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే శనీశ్వరుడు మిమల్ని అనుగ్రహిస్తాడు.

శనీశ్వరుడిని ఎప్పుడూ శని శని అని పిలవకూడదట. శనీశ్వరా అని మాత్రమే పలకాలి. విశేషం ఏమంటే ఈశ్వర శబ్దం ఎక్కడ ధ్వనిస్తుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఉదాహరణకి శివుడిని ఈశ్వరుడు, మహేశ్వరుడు అంటాం, ఆయన అలా అనుగ్రహిస్తాడు… వెంకటేశ్వర స్వామి పేరులోనూ ఈశ్వర శబ్దం ఉంది. ఈశ్వర శబ్దం ఉంది కాబట్టే ఆయన కలియుగ దైవంగా మారి మన కోరికలను నెరవేరుస్తున్నాడు. అలాగే శనీశ్వరుడి నామంలోనూ శని, ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా శివుడిలా, వేంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. శనీశ్వరుడికి భ‌యపడాల్సిన పనిలేదు. నవగ్రహ‌ మండపానికి వెళ్లినప్పుడు శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేయండి. నమస్కరించడం వల్ల, శనివార నియమాల్ని పాటించడం వల్ల, నీలం లేదా నలుపు రంగు వస్త్రాల్ని ధరించడం వల్ల, ఆయనకు ఇష్టమైన చిమ్మిలి నివేదనం చేయడం వల్ల, శివారాధన చేయడం వల్ల, తప్పక అనుగ్రహిస్తాడు.

do pooja to lord shani like this he will give wealth

శనీశ్వరుడి వల్ల కలిగే దోషాలు అంటే గ్రహరీత్యా ఏ గ్రహమైనాసరే మీకు యోగంతోపాటు పీడని కలిగిస్తుంది. శనీశ్వరుడు కూడా అంతే ఆయన నివాసం ఉన్న స్థానాన్ని బట్టి జన్మ శని, ద్వాదశ శని, లేదా ద్వితీయ శనిగా కొద్దిగా కష్టాలకు గురిచేస్తాడు. ఎవరైతే శనీశ్వరుని భక్తిగా పూజించి, గౌరవిస్తారో అలాంటి వాళ్లను అనుగ్రహిస్తాడు. అయితే ఎప్పుడు కూడా శని పీడ రావాలనే కోరుకోవాలట. ఎందుకంటే శనీశ్వరుడు కొద్దిగా పీడించాడంటే దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీ మీకు అందించి వెళ్తాడు. మీరు శనీశ్వరుడి ప్రభావం కోరుకోకపోతే ఆయన ఇచ్చే యోగం, ఐశ్వర్యం కూడా రాదట. అందుకే శనీశ్వరుడు పీడించాలి, దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీకలిగించాలని భక్తిశ్రద్ధలతో కోరుకోవాలట. శనీశ్వరుడి ఆరాధించాలి.

చక్కగా నీలిరంగు పుష్పాలతో పూజించి, శివారాధన, హనుమాన్, అయ్యప్ప ఆరాధనా చేయాలట. అలాగే శనివార నియమాల్ని పాటించడం వల్ల కూడా శనీశ్వరుడు అనుగ్రహిస్తాడట. కొద్ది ఇబ్బందులు ఎదురైనా అంతకు మించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది తెలిసిన తర్వాత శనీశ్వరుడు అంటే భయం తొలగిపోతుంది.

Tags: lord shani
Previous Post

పెళ్లి సందడి హీరోయిన్ రవళిగుర్తుందా ? ఇప్పుడేంతలా మారిపోయిందంటే ?

Next Post

రోజూ అన్నం తర్వాత ఈ పనుల్లో ఏ ఒక్కటి చేసినా దరిద్రానికి వెల్‌కమ్ చెప్పినట్టే..!

Related Posts

చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

June 13, 2025
ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడి సంతానం ఎవ‌రు.. వారి పేర్లు ఏమిటి..?

June 13, 2025
Off Beat

మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

June 13, 2025
ఆధ్యాత్మికం

హ‌నుమాన్ ఆల‌యంలో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..?

June 13, 2025
lifestyle

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!