Ashu Reddy : బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నీ మధ్యే చిరిగిన జీన్స్ వేసుకుని యాంకర్ రవితో కలిసి దర్శనమిచ్చింది. ఇక ఈమె సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫొటోస్‌ను ఈమె షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఓ ఫొటోను షేర్ చేసిన అషు రెడ్డి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
అషు రెడ్డి తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేయగా.. అందులో ఆమె కారు నంబర్ కూడా స్పష్టంగా కనిపించింది. దీంతో నెటిజన్లు ఈమె కారుకు చలాన్లు ఎన్ని ఉన్నాయో ఆన్‌లైన్‌లో చెక్ చేశారు. రూ.2305 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారు ఆమెను ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లను కట్టాలని అంటున్నారు.
ఇక ఓ నెటిజన్ అయితే.. అక్కా అని సంబోధిస్తూ చలాన్లను కట్టాలి కదా.. అని అడగ్గా.. అందుకు ఆమె రిప్లై ఇచ్చింది. కడతానులేరా బాబూ అని చెప్పింది. దీంతో ఆమె పెట్టిన పోస్టు, కామెంట్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ప్రస్తుతం యాంకర్ రవితో కలిసి హ్యాపీ డేస్ అనే షో చేస్తోంది. అలాగే త్వరలో ఫోకస్ అనే సినిమాలో కనిపించనుంది.