ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే ఎంత‌టి ద‌గ్గు అయినా స‌రే త‌గ్గాల్సిందే..!

ఆయుర్వేదంలో త్రిక‌టు చూర్ణానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. మూడు మూలిక‌ల మిశ్ర‌మం ఇది. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. న‌ల్ల మిరియాలు, పిప్ప‌ళ్లు, అల్లం.. మూడింటిని క‌లిపి త్రిక‌టు చూర్ణం త‌యారు చేస్తారు. మార్కెట్‌లో త్రిక‌టు చూర్ణం ల‌భిస్తుంది. కానీ ఈ చూర్ణాన్ని ఇంట్లో కూడా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు.

ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే ఎంత‌టి ద‌గ్గు అయినా స‌రే త‌గ్గాల్సిందే..!ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే ఎంత‌టి ద‌గ్గు అయినా స‌రే త‌గ్గాల్సిందే..!

ఎండిన అల్లం పొడి 10 గ్రాములు, న‌ల్ల మిరియాల పొడి 10 గ్రాములు, పిప్ప‌ళ్ల చూర్ణం 10 గ్రాములు తీసుకుని అన్నింటినీ బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని త్రిక‌టు చూర్ణం అంటారు. దీన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. అలాగే బెల్లం, నెయ్యిల‌ను కూడా అర టీస్పూన్ చొప్పున తీసుకోవాలి. వీటిని అన్నింటినీ క‌లిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. భోజ‌నం చేసిన అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవాలి.

ఇలా 15 రోజుల పాటు ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఎంత‌టి ద‌గ్గు అయినా స‌రే త‌గ్గిపోతుంది. ఇత‌ర శ్వాస కోశ స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.

త్రిక‌టు చూర్ణంతో బెల్లం, నెయ్యి క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల అనేక విధాలుగా మేలు జ‌రుగుతుంది. శ్వాస కోశ స‌మ‌స్య‌ల‌కు ఈ మిశ్రమం అద్భుతంగా ప‌నిచేస్తుంది.

ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే ఎంత‌టి ద‌గ్గు అయినా స‌రే త‌గ్గాల్సిందే..!ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే ఎంత‌టి ద‌గ్గు అయినా స‌రే త‌గ్గాల్సిందే..!

అయితే గ్యాస్‌, అసిడిటీ, డ‌యాబెటిస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఈ మిశ్ర‌మాన్ని తీసుకోరాదు. మిగిలిన ఎవ‌రైనా ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌చ్చు.

త్రిక‌టు చూర్ణాన్ని సీసాలో నిల్వ చేసుకుంటే 3-6 నెల‌ల వ‌ర‌కు నిల్వ ఉంటుంది. అదే దాన్ని బెల్లం, నెయ్యిల‌తో క‌లిపి నిల్వ చేస్తే 2 వారాల వ‌ర‌కు నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఈ మిశ్ర‌మాన్ని ఒకే సారి నిల్వ చేసి రోజూ పైన చెప్పిన‌ట్లుగా తీసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ద‌గ్గు త‌గ్గ‌డంతోపాటు శ్వాస కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Admin

Recent Posts