రోజూ ఉదయమే చాలా మంది పూజల కోసం పక్క వాళ్ల ఇంట్లో ఆవరణలో ఉండే మొక్కలకు పూసిన పువ్వులను కోస్తూ కనిపిస్తుంటారు. కొందరు వాకింగ్ అని వెళ్తూ మధ్యలో ఎక్కడ పూలు కనపడ్డా కోస్తుంటారు. వాటిని ఇంటికి తెచ్చి వాటితో పూజలు చేస్తుంటారు. అయితే ఇలా పక్క వాళ్ల పూలతో పూజలు చేయవచ్చా ? దాంతో ఎలాంటి ప్రభావాలు కలుగుతాయి ? అంటే..
మొక్కలకు యజమానులు అయినా సరే వారు తమ మొక్కలకు చెందిన పువ్వులను పూర్తిగా కోసే అధికారం లేదు. దేవుడి పూజ కోసమని మొక్కను ముందుగా ప్రార్థించాలి. తరువాత కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. అన్నీ పూలను కోసేసి బోసి మొక్కల్లా ఉంచరాదు. అది మహా పాపం కిందకు వస్తుంది.
ఇక పక్క వాళ్లను అడగకుండా పూలను కోయడం దొంగతనం కిందకు వస్తుంది. అందుకు శిక్షగా మళ్లీ జన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. అందువల్ల పువ్వులను కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఇక యజమానులు ఒప్పుకున్నా వారి మొక్కలకు చెందిన పువ్వులను కోసి వాటితో పూజలు చేస్తే అప్పుడు కలిగే పుణ్యంలో సగం పుణ్యం ఆ పువ్వులకు చెందిన యజమానులకు పోతుంది.
కనుక పక్కవాళ్ల మొక్కలకు చెందిన పువ్వుల కన్నా మన ఇంట్లో మన మొక్కలకు పూసిన పువ్వులతో పూజలు చేస్తే మేలు. ఈ విషయాలను సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడ పురాణంలో గరుడునికి వివరించాడు.