ఆధ్యాత్మికం

Coconut Breaking Before God : దేవుడి ద‌గ్గ‌ర అస‌లు కొబ్బ‌రికాయ‌ల‌ను ఎందుకు కొడ‌తారు.. దీని వెనుక ఉన్న కార‌ణమేమిటి..?

Coconut Breaking Before God : హిందూ సంప్రదాయంలో కొబ్బరి కాయకు చాలా ప్రాధాన్యం ఉంది. గుడికి వెళ్ళినా, ఏదైనా మంచి పని మొదలు పెట్టాలన్నా కొబ్బరి కాయ కొట్టి మొదలు పెడతారు. అయితే కొబ్బరి కాయనే ఎందుకు కొడతారు.. అనే విష‌యం మనలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు కొబ్బరి కాయ కొట్టడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కొబ్బరి కాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొబ్బరి కాయ దేవుడు ముందు కొట్టడం వల్ల మనిషిలో ఉన్న అహంకారం పటాపంచలు అవుతుంది.

అదెలా అంటే.. మన పూర్వీకుల నుండి కొబ్బరి కాయని మనిషి తలతో పోలుస్తారు. కొబ్బరి పీచుని మనిషి జుట్టుతో పోల్చారు. దాని ఆకారాన్ని మనిషి ముఖం గానూ, అందులో నీటిని రక్తంగానూ పోలుస్తారు. అందులో ఉండే కొబ్బరిని మన మనస్సుగా భావిస్తారు. అందుకే కొబ్బరి కాయ కొట్టడం వల్ల మనసులో ఉండే కల్మషం, అహంకారం అన్ని పోతాయి.అయితే కొంత మందికి కొబ్బరి కాయ కొట్టినప్పుడు పువ్వు రావ‌డం లేదా కుళ్ళి పోవడం జరుగుతుంది. దీని వల్ల అందరూ భయపడతారు.

coconut breaking before god what happens if we do it

ఇలా కుళ్ళిపోవడాన్ని కీడుగా భావిస్తారు. అయితే దీని వల్ల నష్టం జరగద‌ని పురోహితులు చెప్తున్నారు .ఇలా జరిగినపుడు దాన్న‌ అవతల పడేసి చేతులు, కాళ్ళు కడుక్కోవాలి. కొబ్బరిలో పువ్వు వస్తే మంచిదిగా భావించవచ్చు. కొత్తగా పెళ్ళైన జంట కొబ్బరి కాయ కొట్టినపుడు పువ్వు వస్తే వారికి పిల్లలు పుడతారని నమ్మకం. కొబ్బరి కాయ సమానంగా పగిలితే మనసులో కోరిక నెరవేరుతుందని భావిస్తారు. ఏ దేవుడికైనా భక్తితో పూజ చేసి కొబ్బరి కాయ నివేదన చేస్తే సరిపోతుంది. వేరే ఏ విధమైన నైవేద్యం అవసరం లేదు. ఎన్ని రకాల నైవేద్యాలు ఉన్నా కొబ్బరి కాయ కొట్టనిదే పూజ పూర్తి కాదు. అందుకే కొబ్బరి కాయను దేవుడి ముందు కొడ‌తారు. ఇవీ.. దాని వెనుక ఉన్న అస‌లు కార‌ణాల‌ని చెప్ప‌వ‌చ్చు.

Admin

Recent Posts