ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవడం లేదని బాధపడేవారు కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. ఇలా చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. కుజుడి శక్తి, ధైర్యం, బలానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ గ్రహ ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తుంటాయి. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన లేకపోవడం, ఇద్దరూ దూరం అవ్వడం, మానసికంగా దూరం అవడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. కుజ దోషం కారణంగా వివాహం ఆలస్యం అవుతుంది. వివాహం చేసుకున్న వారికి అయితే సమస్యలు వస్తుంటాయి. అందుకు వారు కొన్ని పరిహారాలను పాటించాలి.
పెళ్లి కాని అమ్మాయిలకు కుండతో వివాహం జరిపించాలి. దీంతో కుజ దోషం పోయి త్వరగా వివాహం అవుతుంది. అలాగే పురుషులకి అయితే ఉమ్మెత్త మొక్కతో పెళ్లి జరిపించాలి. ఇది కుజ దోషాన్ని నివారిస్తుంది. దీంతో పురుషులకు త్వరగా పెళ్లి అవుతుంది. అలాగే పెళ్లి కాని యువతీ యువకులు హనుమాన్‌ను పూజించాలి. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను చదవాలి. ఉపవాసం ఉండాలి. దీంతో పెళ్లి త్వరగా అవుతుంది. కుజ దోషం ఉన్నవారు ఒక మంత్రాన్ని పఠిస్తుండాలి. ఓం క్రం క్రీం కరౌమ్ సహ భౌమయ నమః అనే మంత్రాన్ని పఠిస్తుంటే ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వివాహం అయ్యాక సమస్యలు వస్తున్నవారు ఎర్ర రంగు దుస్తులు, పప్పులు, ఎర్రని పూలు, రాగి పాత్రలను మంగళవారం నాడు దానం చేస్తే మంచిది. దీంతో కుజ దోషం పోతుంది. దంపతుల మధ్య సఖ్యత పెరిగి అన్యోన్యంగా ఉంటారు. పెళ్లి అయిన వారు తమ వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే మంగళవారం నాడు మద్యం సేవించడం, మాంసాహారం తినడం మానేయాలి. ఇలా చేసినా కూడా ఫలితం ఉంటుంది. కుజుడు కోపానికి కారకుడు. కనుక దంపతులు ప్రతి చిన్న విషయంలోనూ గొడవ పడకూడదు. వీలైనంత వరకు సర్దుకుపోయే ప్రయత్నం చేయాలి. అప్పుడు కుజ దోష ప్రభావం తగ్గుతుంది. దంపతులు సుఖ సంతోషాలతో జీవిస్తారు.