హిందూ ధర్మం ప్రకారం ఉదయం లేచిన తర్వాత ఈ కొన్ని పనులు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఉదయాన్నే మనిషి దయనందిన జీవితంలో అలవాట్లు అనేవి ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. పైగా మన అలవాట్ల మీద మన వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంది. ముఖ్యంగా లైఫ్ లో ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఉండాలంటే ఈ అయిదు అలవాట్ల ని తప్పకుండా పాటించండి. ఉదయం లేచిన వెంటనే హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం అత్యంత పతివ్రతలైన అహల్య, ద్రౌపది, కుంతి, తారా, మండోదరి పేర్లను తలచుకోవాలి. వీళ్ళని పంచ కన్యలు అంటారు.
ఉదయం లేచాక వీళ్ళని తలుచుకుంటే ఎంతో శుభం కలుగుతుంది దోషాలు ఏమైనా వున్నా కూడా పోతాయి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అలానే ఉదయం లేచిన వెంటనే కళ్ళ మీద రెండు చేతులు పెట్టుకుని ”కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే బ్రహ్మ ప్రభాతే కరదర్శనం” అని ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచి జరుగుతుంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా మీరు వృద్ధి చెందుతారు. పైకి వస్తారు.
లేచిన తర్వాత భూదేవికి నమస్కారం చేసుకోవడం కూడా మర్చిపోకండి. లేచి మొదటి అడుగు వేయగానే భూదేవికి నమస్కారం చేసుకోండి. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ లేచిన తర్వాత ఆ మొబైల్ ఫోన్ ని చూస్తున్నారు. దాని వలన నెగిటివ్ ఎనర్జీ మాత్రమే కలుగుతుంది.
ఉదయం లేచాక ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని ఇంట్లో ఉన్న భగవంతుడిని పూజించండి ఆ తర్వాత మీ పనులు చేసుకోండి. గోవుకి ఆహారం పెట్టడం కూడా చాలా మేలు కలిగిస్తుంది ధర్మ శాస్త్రాల్లో వేద పండితులు ఈ విషయాన్ని చెప్పారు ఆవుని పూజిస్తే లక్ష్మీ దేవిని కొలుస్తున్నట్లే. కనుక ప్రతీ రోజూ ఇలా చేయండి. ఆనందంగా వుండండి.