ఆధ్యాత్మికం

గురువారం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పులు చేయ‌రాదు.. లేదంటే అంతా న‌ష్టమే జ‌రుగుతుంది..!

వారంలో ఏడు రోజులు ఉంటాయ‌న్న సంగ‌తి అందరికీ తెలిసిందే. ఈ ఏడు రోజుల‌కు గాను ఒక్కో రోజు ఒక్కో దైవాన్ని భ‌క్తులు పూజిస్తుంటారు. అయితే గురువారం చాలా మంది సాయిబాబాకు పూజ‌లు చేస్తారు. కానీ వాస్త‌వానికి ఆ రోజు విష్ణువుది కూడా. అందుక‌ని ఆయ‌న‌కు కూడా పూజ‌లు చేయ‌వ‌చ్చు. వెంక‌టేశ్వ‌ర స్వామి, విష్ణుమూర్తి, స‌త్య‌నారాయ‌ణ స్వామి.. ఇలా ఆయ‌న రూపాల‌కు ఆ రోజు పూజ‌లు చేయ‌వ‌చ్చు. అయితే గురువారం రోజు చేయ‌కూడ‌ని కొన్ని ముఖ్య‌మైన ప‌నులు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గురువారం ఎట్టి ప‌రిస్థితిలోనూ దుస్తుల‌ను శుభ్రం చేయ‌రాదు. అలా చేస్తే అరిష్ట‌మ‌ని చెబుతున్నారు. అంతా న‌ష్ట‌మే జ‌రుగుతుంద‌ట‌. అలాగే గురువారం రోజు మొక్క‌ల‌ను నాట‌కూడ‌ద‌ని.. నాటితే గురు గ్ర‌హానికి కోపం వ‌స్తుంద‌ని.. దీంతో అశుభ దృష్టి మీద ప‌డుతుంద‌ని చెబుతున్నారు. అలాగే గురువారం రోజు మ‌హిళ‌లు త‌లంటు స్నానం చేయ‌రాదు. చేస్తే గురుగ్ర‌హం బ‌ల‌హీనంగా మారుతుంది. క‌నుక మ‌హిళ‌లు ఆ ప‌ని చేయ‌రాదు.

do not make these mistakes on thursday at any cost

గురువారం రోజు శిరోజాల‌ను, గోర్ల‌ను క‌త్తిరించ‌రాద‌ని, అలా చేస్తే తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని అంటున్నారు. అలాగే గురువారం ఎట్టి ప‌రిస్థితిలోనూ అర‌టి పండ్ల‌ను తీసుకోరాదు. ఎందుకంటే అర‌టి పండ్ల‌ను విష్ణువుకు ప్ర‌సాదంగా పెడ‌తారు. క‌నుక ఆ రోజు మ‌నం వాటిని స్వీక‌రించ‌రాదు. ఇక గురువారం ప‌దునుగా ఉండే వ‌స్తువుల‌ను కొన‌రాదు. అలాగే స‌బ్బులు, స‌ర్ఫ్‌ను కూడా తీసుకోరాదు. ఆ రోజు మాంసాహారం ముట్ట‌రాదు. ఉల్లిపాయ‌లు, వెల్లుల్లి వంటి తామ‌స ఆహారాల‌ను కూడా తిన‌రాదు. మ‌ద్యం సేవించ‌రాదు. గురువారం రోజు ఎవ‌రికీ డ‌బ్బును అప్పుగా ఇవ్వ‌రాదు. ఇస్తే ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని అంటున్నారు. ఇలా గురువారం చేయ‌ని ప‌నులు కొన్ని ఉన్నాయి. వాటిని త‌ప్ప‌నిస‌రిగా గుర్తుంచుకోవాలి. లేదంటే ఇబ్బందులు వ‌స్తాయి.

Admin

Recent Posts