food

Dates Laddu : నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నారా..! ఈ ఒక్క లడ్డూను తినండి చాలు, వంద రెట్ల‌ బలం వస్తుంది..!

Dates Laddu : ఈ మధ్య కాలంలో అన్ని వయస్సుల వారు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా నరాలకు సంబందించిన సమస్యలు మరియు రక్తహీనత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. శరీరంలో B12 లోపం ఏర్పడినప్పుడు నరాల బలహీనత వంటి సమస్య మనకు ఎదురవుతుంది. శరీరంలో సంకేతాల ప్రసారానికి నరాలు ముఖ్య బాధ్యత వహిస్తాయి. నరాల రుగ్మతలు లేదా నరాలకయ్యే గాయాలు వంటివి నరాల సాధారణ పని తీరును దెబ్బతీస్తాయి. దీనివలన నరాలలో సమస్యలు ఏర్పడి బలహీనతకు దారి తీస్తుంది.

ఎప్పుడైతే నరాల బలహీనత సమస్య ప్రారంభమవుతుందో తలనొప్పి, అలసట, నీరసం, జ్ఞాపకశక్తి మందగించడం వంటి సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి సమస్య నుంచి బయట పడాలి అంటే ఇప్పుడు చెప్పే లడ్డు తింటే నరాల బలహీనత సమస్య తగ్గి శరీరంలో ప్రతి నరం ఎంతో బలంగా మారుతాయి.

take dates laddu they will cure nerve weakness

ఈ లడ్డు తయారీ కోసం ఒక కప్పు తవుడును మూకుడులో వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు ఖర్జూరంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఖర్జూరం గట్టిగా ఉంటే వేడి నీటిలో ఒక పది నిముషాలు నానబెట్టాలి. మూకుడులో ఒక కప్పు బెల్లం, అర గ్లాస్ నీటిని పోసి తీగ పాకం వచ్చాక తవుడు, ఖర్జూరం పేస్ట్ పాకంలో వేసి బాగా కలపాలి. చివరిలో ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి.

రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచి ఆ తర్వాత స్టవ్ మీద నుండి దించి చిన్న చిన్న లడ్డులుగా చేసుకోవాలి. ప్రతి రోజు ఒక లడ్డు తింటే శరీరానికి అవసరమైన బి కాంప్లెక్స్ విటమిన్ బాగా అంది నరాలు బలంగా తయారవుతాయి. ఈ లడ్డు తింటే శరీరంలో బలహీనత తగ్గి నీరసం, అలసట లేకుండా హుషారుగా ఉంటారు. జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది.

ఈ లడ్డూ ప్రతిరోజు ఒకటి తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిల‌ని కూడా తగ్గిస్తుంది. అతి తక్కువ ఖర్చులో ఎన్నో పోషకాలు ఉన్న ఈ లడ్డుతో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

Admin

Recent Posts