ఆధ్యాత్మికం

Bruhaspati : ఎట్టిపరిస్థితుల్లో గురువారం నాడు ఈ తప్పులని చేయకండి.. పాపం తగులుతుంది..!

Bruhaspati : గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయకూడదు. ఈ తప్పులు చేస్తే కచ్చితంగా చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. గురువారం నాడు ఈ పనులు చేశారంటే దురదృష్టం వెంటాడుతుంది. ప్రతి రోజు కూడా ఒక్కో విగ్రహానికి అంకితం చేసిన రోజు. ఆయా రోజుని ఆ విగ్రహాలని ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది. జీవితంలో ఎలాంటి బాధలు అయినా సరే దూరమవుతాయి. కొన్ని రోజులు కొన్ని పనులు చేయకూడదని నియమాలు ఉన్నాయి. మరి గురువారం నాడు ఏం చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

గురువారం నాడు ఇంటిని శుభ్రం చేయకూడదు. ఇల్లు సర్దడం, ఇంటిని క్లీన్ చేసుకోవడం వంటివి గురువారం నాడు చేయకూడదు. గురువారం ఇంటిని శుభ్రం చేయడం, చెత్తను తొలగించడం వంటివి దురదృష్టాన్ని తీసుకువస్తాయి. గురువారం నాడు తలస్నానం కూడా చేయకూడదు. స్త్రీలు గురువారం నాడు తలస్నానం చేస్తే, దురదృష్టం కలుగుతుంది. గురువారం నాడు పురుషులు తలస్నానం చేస్తే భార్య పిల్లలకు దురదృష్టం కలుగుతుంది. సంపదని కూడా కోల్పోతారు.

do not make these mistakes on thursday

గురువారం నాడు జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం గీసుకోవడం వంటి వాటి వలన దురదృష్టం కలుగుతుంది. ఇలాంటివి చేస్తే బృహస్పతికి కోపం వస్తుంది. కాబట్టి గోర్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం వంటివి చేయకండి. గురువారం నాడు పదునైన వస్తువులను కూడా కొనుగోలు చేయకూడదు. గురువారం నాడు కేవలం లక్ష్మీదేవిని మాత్రమే పూజించడం మంచిది కాదు. లక్ష్మీదేవితోపాటుగా విష్ణుమూర్తిని కూడా ప్రార్ధించాలి.

గురువారం నాడు దైవ దూషణ కూడా తప్పు. గురువారం నాడు ఉపవాసం చేయడం వలన చక్కటి లాభాలని పొందొచ్చు, గురువారం నాడు ఉపవాసం ఉంటే జీవితంలో అన్ని అడ్డంకులు కూడా పోతాయి. గురువారం నాడు ఆవులకి, పక్షులకి గింజలను ఇవ్వడం కూడా మంచిదే. చూపుడువేలుకి పుష్యరాగ ఉంగరాన్ని పెట్టుకుంటే కూడా మంచి జరుగుతుంది. గురువారం నాడు విష్ణుమూర్తిని ఆరాధించి విష్ణు సహస్రనామాన్ని చదవడం వలన కూడా మంచి జరుగుతుంది.

Admin

Recent Posts