ఆధ్యాత్మికం

Meals : అన్నం తినేటప్పుడు ఈ తప్పులని అస్సలు చెయ్యకండి.. సంపదకి నష్టం కలుగుతుంది..!

Meals : మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మనకి ఎంతో పెద్ద నష్టం కలుగుతూ ఉంటుంది. ప్రతి దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. భోజనం చేయడానికి కూడా పద్ధతి ఉంటుంది. భోజనం చేసేటప్పుడు తప్పులు చేస్తే, సంపద పోతుంది. రాత్రి వేళల్లో అందరూ నిద్ర పోయిన తర్వాత ఆహారం తింటే సంపద పోతుంది. కాళ్ళని చాపి ఆహారాన్ని తింటే కూడా సంపద పోతుంది. అప్పులు బాగా పెరిగిపోతాయి.

తడికాళ్లతో అన్నం తింటే ఆరోగ్యం పాడవుతుంది. స్నానం చేయకుండా అన్నం తింటే ఐశ్వర్యం తగ్గిపోతుంది. ఇంట్లో మూలన కూర్చుని భోజనం చేస్తే ధన నష్టం కలుగుతుంది. దైవాన్ని ప్రార్థించకుండా భోజనం చేస్తే, అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. భోజనం చేస్తున్నప్పుడు ఇతరులతో మాట్లాడితే, దోషం చుట్టుకుంటుంది.

do not make these mistakes while taking meals

పండగ పూట మాంసాహారం తింటే ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు పోతాయి. ఇతరుల ఆహార పదార్థాలను దొంగలించి తింటే, పరమ దారిద్రం అనుభవిస్తారు. మంచం మీద కూర్చుని అన్నం తింటే అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ధన నష్టం కూడా వస్తుంది.

ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం పెడితే, ఆ భోజనం తిని లోపాన్ని చూపిస్తే మహా పాపం కలుగుతుంది. వంట గదిలో కూర్చుని భోజనం చేయడం వలన దోషము కలుగుతుంది. అలానే మానసిక సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా అన్నం తినే సమయంలో ఈ పొరపాట్లని చెయ్యకండి.

Admin

Recent Posts