ఆధ్యాత్మికం

ఇతరుల నుంచి ఈ వస్తువులను ఉచితంగా అస్సలు తీసుకోకూడదు..!

శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఇతరులకు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. అదే విధంగా మరికొన్ని వస్తువులను దానం చేయడం వల్ల లేనిపోని కష్టాలు ఎదురవుతాయి. ఈ క్రమంలోనే కొన్ని వస్తువులను ఇతరులకు ఉచితంగా దానం చేయడం లేదా ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోవటం వల్ల మానసిక అశాంతి, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు. మరి ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడని వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా.

పురాణాల ప్రకారం మనం ఇతరుల నుంచి ఎలాంటి పరిస్థితులలో కూడా ఉప్పును ఉచితంగా తీసుకోకూడదు. ఉప్పును ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోవటం వల్ల అప్పుల పాలవుతారు. అదే విధంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. నల్ల నువ్వులను కూడా ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడదు. ఈ విధంగా తీసుకోవటం వల్ల శని ప్రభావం మనపై పడుతుంది. నల్ల నువ్వులు శనికి ప్రతీకగా భావిస్తారు.

ఇనుమును కూడా ఎవరి నుంచి ఉచితంగా తీసుకోకూడదు. ఒకవేళ ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడితే వారికి కొంత డబ్బులు చెల్లించి తీసుకోవాలి. ఇనుము శనికి ప్రతీక, కనుక ఇనుమును శనివారం మన ఇంటికి తెచ్చుకోకూడదు.

do not take these items from others for free of cost

అలాగే సూదిని ఇతరుల నుంచి తీసుకోవడం వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా ఎంతో ఆందోళన కలుగుతుంది. కనుక సూదిని ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడదు. అదేవిధంగా చేతిరుమాలు ఇతరులకు బహుమానంగా ఇవ్వడం వల్ల వారి మధ్య శత్రుత్వం పెరుగుతుంది. అనారోగ్యం బారిన పడతారు.

వంటకు ఉపయోగించే నూనెను కూడా ఇతరులకు దానమివ్వకూడదు, ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడదు. ఈ విధంగా ఈ వస్తువులను ఇతరుల నుంచి తీసుకునేటప్పుడు కొంత డబ్బును వారికి చెల్లించి తీసుకోవాలి. లేకపోతే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts