Betel Leaves : తమలపాకు లేకుండా ఏ శుభకార్యం, ఏ పూజ కూడా పూర్తి అవ్వదు. తమలపాకు కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ సంప్రదాయంలో తమలపాకు కి ఉన్న ప్రాధాన్యత, ఇంతా అంతా అంత. తమలపాకులో అనేక దేవతా రూపాలు కొలువై ఉంటాయి అని శాస్త్రం చెప్తోంది. ఈరోజు తమలపాకు లో ఏ దేవతలు ఉంటారనే విషయాన్ని తెలుసుకుందాం.
తమలపాకు చివరన మహాలక్ష్మి దేవి ఉంటుంది. జ్యేష్ఠ దేవి తమలపాకు కాడకి, కొమ్ముకి మధ్య ఉంటుంది. అలానే విష్ణుమూర్తి కూడా తమలపాకులో ఉంటారు. తమలపాకు పై భాగంలో అయితె ఇంద్రుడు, శుక్రుడు కొలువై ఉంటారు. మధ్య భాగం లో సరస్వతి దేవి ఉంటారు.
శివుడు, కామదేవుడు తమలపాకు పై భాగంలో ఉంటారట. అంతే కాకుండా తమలపాకు కి ఎడమవైపు పార్వతి దేవి, మాంగల్య దేవి ఉంటే.. కుడి భాగంలో భూమాత ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటారని శాస్త్రం చెప్తోంది. ఇలా దేవతా రూపాలను ఇది కలిగి ఉండడం వలన తమలపాకు కి అంత ప్రాధాన్యత. ఇంత గొప్ప తమలపాకుని అందుకే పూజల్లో వాడతారు. తమలపాకు వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి.