ఆధ్యాత్మికం

మ‌న దేశంలోని ఈ ఆల‌యాల్లో ఇప్ప‌టికీ స్త్రీల‌కు ప్ర‌వేశం లేదు తెలుసా..?

స‌హ‌జంగా దేవుణ్ణి ద‌ర్శించుకోవ‌డానికి ప్రతి ఒక్కరూ దేవాల‌యానికి వెళ్లివస్తుంటారు. చిన్నా, పెద్దా, పేద, ధనిక వంటి తేడా లేకుండా అందరూ దేవుని నివాసానికి వెళ్లి తమ కోరికలు నెరవేరేలా వేడుకుంటారు. భారతదేశంలో స్త్రీలకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆడవారిని దేవతలుగా సైతం పూజిస్తున్న గొప్ప సంస్కృతి మనది. అన్ని రంగాల్లోనూ త‌క్కువ‌గా కాకుండా ఆడ‌వాళ్లు త‌మ ప్ర‌తిభ‌ను చాటుకుంటున్నారు. అయితే మన దేశంలో కొన్ని ఆలయాలలో ఇప్పటికీ కూడా స్త్రీలకు ప్రవేశం లేదు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మొద‌టిది కేరళలో తిరువన్నాలై వైక్కం దగ్గర ఆరాన్ కు దగ్గరలో ఉన్న విష్ణు మూర్తి ఆలయ గర్భ గుడి లోకి స్త్రీలకూ ప్రవేశం నిషిద్ధం. ఇది వింతయే. అంతే కాదు ఇక్క‌డ‌ వైష్ణవ క్షేత్రమైనా విభూతిని వాడటం మరో విచిత్రమైన విశేషం. రెండొవ‌ది ఒడిస్సాలోని పూరీ క్షేత్రంలో ఉన్న విమలా దేవిశక్తి ఆలయంలో ఏడాదిలో కొన్ని రోజులు స్త్రీలకు ప్రవేశం ఉండదు.

do you know that there is no entry for women in these temples in india

మూడోవ‌ది మహా రాష్ట్ర లోని శని శిన్గానా పూర్ ఆలయం లో శనీశ్వర లింగానికి చుట్టూ ఉన్న గట్టు మీదకు స్త్రీలకూ ప్రవేశం ఉండదు. నాలుగోది మంగళ్ చాందీ ఆలయం జార్ఖండ్ లోని బొకారో నగరంలో కలదు. ఈ ఆలయంలో మగవారు మాత్రమే పూజలు జరిపిస్తారు. ఆడవారికి ప్రవేశం లేదు. ఒకవేళ జరిపించాలనుకుంటే గుడి బయట 50 మీటర్ల దూరంలో నిలబడి పూజ చేయాలి.

కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలోని నేలమాళిగలోకి కూడా మహిళలకు ప్రవేశం నిషిద్ధం. ఇలా మ‌న‌దేశంలో ఇలా ఎన్నో ఆల‌యాల్లోకి స్త్రీల‌కు ఇప్ప‌టికీ కూడా ప్ర‌వేశం లేదు.

Admin

Recent Posts