Spirits : దేవుడు ఉన్నట్టే ఈ ప్రపంచంలో దెయ్యాలు, భూతాలు కూడా ఉన్నాయని నమ్మేవారు ఉన్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయత్తులు కట్టుకోవడం, దేవుళ్ల ఫొటోలను దగ్గర ఉంచుకోవడం, ఇతర పనులు చేస్తుంటారు. అయితే దుష్ట శక్తుల బారిన పడకుండా ఉండేందుకు ఇవే కాదు, ఇంకా కొన్ని రకాల సూచనలు కూడా ఉన్నాయి. వాటిని పాటిస్తే దుష్ట శక్తులే కాదు, నెగెటివ్ ఎనర్జీ కూడా దగ్గరకు రాదు. దీంతో అదృష్టం కలసి వస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
తులసి ఆకులను కొన్నింటిని తీసుకుని వాటి నుంచి రసం తీయాలి. దాన్ని శుభ్రమైన మంచి నీటిలో కలపాలి. ఆ తరువాత దైవాన్ని ప్రార్థించి ఆ ద్రవాన్ని ఇంట్లో చల్లాలి. దీంతో దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఇంట్లో పండితులచే యజ్ఞం చేయించాలి. దీంతో వారు చదివే మంత్రాలకు, యజ్ఞం నుంచి వచ్చే పొగకు దుష్ట శక్తులు పారిపోతాయి. అంతా శుభమే జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ధనాన్ని అది ఆకర్షిస్తుంది. బాగా ఎర్రగా ఉండి మండుతున్న నిప్పులను ఒక లోహపు ప్లేట్‌పై తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువను వేయాలి. దీంతో దాన్నుంచి పొగ వస్తుంది. దాన్ని ఇంట్లో అంతటా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి. ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు. నెగెటివ్ ఎనర్జీ పోతుంది.
కొద్దిగా జీలకర్ర, ఉప్పులను తీసుకుని బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఇంటి ప్రధాన ద్వారం ఎదుట చల్లాలి. తరువాత మిగిలిన తలుపులు, కిటికీల వద్ద కూడా ఆ మిశ్రమాన్ని చల్లితే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పెద్దంగా సౌండ్ పెట్టుకుని సంగీతాన్ని వినడం, ఇంట్లోకి గాలి, సూర్య కాంతి ధారాళంగా వచ్చేలా చేయడం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం, వినోదభరితమైన కార్యక్రమాలను ఇంట్లో చేస్తూ ఉంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్‌కు ఇంట్లో దుష్ట శక్తులు ఉండవు. పారిపోతాయి. నెగెటివ్ ఎనర్జీ పోతుంది.
సిలికా స్ఫటికం, టైగర్ ఐరన్ స్ఫటికం, పుష్యరాగం, గోమేధికం తదితర స్ఫటికాలు, రాళ్లలో వేటినైనా కొన్నింటిని తీసుకుని ఇంట్లో ప్రతి మూల, ప్రతి గదిలో పెట్టాలి. దీంతో దుష్టశక్తులు రావు. నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఇతరులకు సహాయం చేయడం, దాన, ధర్మాలు చేయడం, దైవ ప్రార్థనలు చేయడం వంటి పనులు చేసే వారిని దుష్ట శక్తులు బాధించవట. అవే కాదు, నెగెటివ్ ఎనర్జీ కూడా వారి దరికి చేరదట.