మహాశివరాత్రి..హిందువులు జరుపుకునే పండుగల్లో ఒకటి..శివరాత్రి రోజు ఉపవాసం ఉండి,జాగారణ చేయడం ప్రత్యేకత..పెద్దసంఖ్యలో పెద్దలు,చిన్నపిల్లలు,మగవారు అందరూ ఉపవాసం ఉంటారు శివరాత్రినాడు ముఖ్యంగా ఏదైనా శివాలయాల్లో జాగారణ చేయడానికి మక్కువ చూపుతారు భక్తులు..జాగరణ,ఉపవాసంతో,శివారాధనతో పాటు శివరాత్రి రోజు పాటించాల్సిన మరో నియమం ప్రదక్షిణలు..
సాధారణంగా శివాలయాల్లో చేసే ప్రదక్షిణకు మిగిలిన ఆలయాల్లో చేసే ప్రదక్షిణలకు తేడా ఉంటుంది. శివాలయాల్లో ఎలాంటి ప్రదక్షిణలు చేయాలో అలా చేయటం వల్ల కలిగే ఫలితాలేమిటో మన పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.శివాలయాల్లో ప్రదక్షిణలు ఎలా చేయాలో తెలుసుకోండి..ఈ శివరాత్రికి శివారాధన,ఉపవాసం,శివాలయంలో జాగారణ ఉండి,ప్రదక్షిణలు చేసి శివుడి అనుగ్రహం పొందండి..
శివాలయం ధ్వజ స్తంభం దగ్గర నుండి మనకు ఎడమ పక్కగా బయలు దేరి గర్భాలయానికి వెనుక ఉన్న సోమసూత్రం వరకు వెళ్లి వెనుతిరగాలి. కానీ సోమసూత్రం దాటరాదు. అక్కడ నుంచి వెనుతిరిగి అప్రదక్షణంగా మళ్లీ సోమ సూత్రాన్ని చుట్టుకొని సోమ సూత్రం వరకు రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ ముగిసినట్లు. ఇలా బేసి సంఖ్యలో వచ్చే విధంగా 3, 5, 7, 9 ప్రదక్షిణలు చేయవచ్చు. శివప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదన్నది ప్రధాన నియమం. అలా చేస్తే ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక్క ప్రదక్షిణ కిందకే వస్తుందంటుంది శాస్త్రం.