ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌ల వ‌స్తున్నాయా.. అయితే జాగ్ర‌త్త‌..

కొన్ని కలలు మంచికి సంకేతం అయితే..మరికొన్ని మాత్రం చెడుకు దారితీయవచ్చు. కలలో జంతువులు, మొక్కలు, రకరకాల సన్నివేశాలు కనిపిస్తుంటాయి. అయితే జ్యోతిషశాస్త్రం ఆ కలలకు.. అనేక అర్థాలను చెప్పింది. మీ కలలో పూర్వీకులను పదేపదే చూస్తుంటే.. ఈ కలను వృధాగా పరిగణించవద్దు. ఈ కలల ద్వారా మీ పూర్వీకులు మీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారనే దానికి సంకేతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే కొన్నిసార్లు కలల ద్వారా, పూర్వీకులు మీ పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేయవచ్చు. అంతేకాదు కొన్నిసార్లు మీ పితృదేవతలు ఆ కలలు ద్వారా మీ పట్ల ఆనందాన్ని కూడా వ్యక్తం చేయవచ్చు. కలలో తరచుగా ఇలాంటి సంకేతాలు కనిపిస్తుంటే.. మీ పితృదేవతలు మీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని అర్ధం.. అశుభం కలిగించే కొన్ని కలల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మీ కలలో కాకి కొడుతున్నట్లు కనిపిస్తే.. మీ పూర్వీకులు మీపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. మీరు ఎక్కడ మీ పితృదేవతలకు కోపం తెచ్చేలా తప్పు చేశారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.. పిత్రు దేవతలు ఏడుస్తూ కనిపిస్తే..మీ పూర్వీకులకు ఇంకా మోక్షం లభించలేదనడానికి సంకేతం. వారు కలత చెందుతున్నారని ఈ కలకు అర్ధం. అటువంటి పరిస్థితిలో.. మీరు మీ పూర్వీకుల మోక్షానికి బ్రాహ్మణులకు విందుభోజనం పెట్టి.. దానాదికార్యక్రమాలు నిర్వహించాలి..వారికి మోక్షం కలిగేలా చూడాలి..

if you are getting this type of dreams then beware

పితృదేవతల కోపం తీర్చడానికి..మీ కలలో మీ పూర్వీకులు మీపై కోపంగా ఉంటే.. దీనికి కారణం ఇంట్లో పితృ దోషం వల్ల కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో.. మీరు జ్యోతిష్కులను సంప్రదించి.. తగిన పరిష్కారం తీసుకోవాలి..పెద్దలకు మోక్షం కలగాలి అంటే పది మందికి మంచి చేయాలి.అంటే ఆకలిని తీర్చడం చేస్తే మంచిది.

Admin

Recent Posts