ఆధ్యాత్మికం

ఉప్పు దీపాన్ని ఇలా పెట్టండి.. మీకు ఆర్థిక స‌మ‌స్య‌లు అస‌లు ఉండ‌వు..

ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు అనేది చాలా అత్యవసరం. అయితే కొంతమంది ఎంత సంపాదించినా ఆ డబ్బు ఖర్చవుతుంది. ముఖ్యంగా అప్పులు కట్టలేక.. వడ్డీలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక వ్యాపారంలో, ఉద్యోగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక అరకొర జీతంతో.. ఆదాయం పెరగని వారికి.. వ్యాపారంలో పలు కారణాల వల్ల నష్టాలు.. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి.. ఎలాంటి ఆదాయం లేని వారికి ఇలా ఎంతో మందికి డబ్బు అనేది అవసరం అవుతుంది..కానీ ఎలా సంపాదించాలి..? ఆ డబ్బు ఎలా వస్తుంది..? ఒకవేళ వచ్చిన డబ్బును ఎలా కాపాడుకోవాలి..? అనే విషయం కూడా తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆర్థిక సమస్యలను దూరం చేసే పరిష్కారం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం ఉదయం అలాగే సాయంత్రం రెండు ప్రమిదలు తీసుకొని పసుపు, కుంకుమలతో అలంకరించాలి. ఇక నేలపై బియ్యంపిండి అలాగే పసుపు , కుంకుమలతో ముగ్గు వేయాలి. ఇక ఆ ముగ్గు పైన ప్రమిదలను ఒకదానిపై ఒకటి పెట్టి ఆ ప్రమిదలలో పావుకిలో కళ్లఉప్పు వేయాలి. ఇక ఆ ఉప్పు పైన ఇంకొకసారి పసుపు కుంకుమ చల్లి , చిన్న ప్రమిదలు ఒకదానిపై ఒకటి పెట్టి పసుపు, కుంకుమ , పూలు వేసి అందులో నూనె వేసి.. రెండు వత్తులు జతగా చేసి వెలిగించాలి. దీపాన్ని అగరవత్తి సహాయంతో వెలిగిస్తూ దీపం యొక్క శ్లోకాన్ని పఠించాలి.

put uppu deepam like this your money problems will go away

ఇక ఈశాన్య మూలలో ప్రతి శుక్రవారం ఉప్పు పైన దీపం వెలిగించి.. మరుసటి రోజు అనగా శనివారం రోజు ఆ ఉప్పు ను మార్చాలి. ఇలా 11 శుక్రవారాలు మీరు ఈ దీపాన్ని వెలిగించి ఈశాన్యం మూల పెట్టినట్లయితే ఆర్థిక సంపద పెరుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి స్తోత్రాన్ని దీపం వెలిగిస్తూ చదవడం వల్ల మరిన్ని ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు కనకధారా స్తోత్రం చదవడం వల్ల మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు ఒకసారి ఇలా ఉప్పు తో దీపాన్ని వెలిగించి చూడండి.. ఆర్థిక పరిస్థితులన్నీ దూరమవుతాయి.

Admin

Recent Posts