ఆధ్యాత్మికం

Sarayu River In Ayodhya : అయోధ్య వెళ్తే స‌ర‌యు న‌దిలో త‌ప్ప‌క స్నానం చేయాలి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sarayu River In Ayodhya &colon; అయోధ్యకు వెళ్ళినప్పుడు తప్పకుండా చెయ్యాల్సిన పని ఒకటి ఉంది&period; అదేంటంటే&period;&period; అయోధ్యలోని సరయు నదిలో మునకలు వేయడం&period; అవును&comma; అక్క‌డికి వెళ్తే à°¤‌ప్ప‌క à°¨‌దిలో స్నానం చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయోధ్య కథ‌కు సరయు నది చాలా ముఖ్యమైనది&period; ఎందుకంటే శ్రీరాముడు అడవికి వెళ్లి వనవాసం చేసి తిరిగి అయోధ్యకు వచ్చిన తరువాత ఆయన జీవితాన్ని చూసినది సరయు నదే&period; వేదాలలో కూడా సరయు నది ప్రస్తావన వస్తుంది&period; పద్మ పురాణంలో ఈ నది గొప్పదనం గురించి చెప్పబడింది&period; మహాభారతంలోని భీష్మ పర్వంలో కూడా ఈ నది గొప్పదనం గురించి వస్తుంది&period; అయోధ్యకు ప్రాథ‌మిక గుర్తింపుగా తులసి దాస్ సరయు నదిని వర్ణిస్తాడు&period; ఋగ్వేదం లో చెప్పినట్లు సరయు నది ఒక వేదం నది&period; శ్రీమహా విష్ణువు కన్నీటి బొట్టు నుంచి సరయు నది ఆవిర్భవించింది అని పురాణాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63130 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;sarayu-river&period;jpg" alt&equals;"if you go to ayodhya then you must do bath in sarayu river " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శాంకసరుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రంలో పడేస్తాడు&period; విష్ణువు మత్స్య అవతారం ధరించి ఆ రాక్షసుడిని చంపి&comma; వేదాలను తీసి బ్రహ్మకి అప్పగిస్తాడు&period; విష్ణువు కళ్ళలో ఆనందంతో కన్నీళ్లు వస్తాయి&period; ఆ కన్నీళ్లను మానస సరోవరంలో ఉంచాలని బ్రహ్మ దేవుడు చెయ్యి పట్టి తీసుకుంటాడు&period; ఆ కన్నీళ్ల తోనే సరయు నది ఏర్పడిందని వేదాలు చెబుతున్నాయి&period; హిమాలయాల పాదాల నుంచి ఉద్భవించిన సరయు నది శారదా నదికి ఉపనదిగా మారుతుంది&period; సరయు నది భూమిపై శ్రీ రాముని బాల్య లీలలను చూడడానికే ఉద్భవించింది అని చెబుతుంటారు&period; క‌నుక అయోధ్య‌కు వెళ్తే à°¸‌à°°‌యు à°¨‌దిలో స్నానం చేయ‌డం à°®‌రిచిపోకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts