ఆధ్యాత్మికం

Lord Shani : శ‌నివారం నాడు ఇవి క‌నిపించాయా.. మీకు శ‌ని అనుగ్ర‌హం ఉన్న‌ట్లే..!

Lord Shani : శనివారం నాడు ఇవి కనుక కనపడ్డాయి అంటే శని దేవుడి అనుగ్రహం మనకి కలుగుతుంది. శనివారానికి, శని దేవుడికి అభినవభావ సంబంధం ఉంది. అయితే శనివారం నాడు కొన్ని కొన్ని జరిగినట్లయితే మనకి ఎంతో మంచి జరుగుతుందట. చాలా శుభమట. అయితే శని దేవుడి అనుగ్రహం మీపై ఉందని మీరు ఎలా తెలుసుకోవాలి.. అనేది ఇప్పుడు చూద్దాం. శనివారం నాడు ఇలా కనుక జరిగినట్లయితే కచ్చితంగా మీకు మంచి జరగబోతుందని అర్థం చేసుకోవాలి.

శని దేవుడికి అనుకూలమైన రోజు శనివారం. కనుక ఆ రోజు ఇవి జరిగితే చాలా చక్కటి ఫలితం కనపడుతుంది. శని చెడు ప్రభావం పడితే ఇంట్లో అనేక ఇబ్బందులు కలుగుతాయి. సంతోషం ఉండదు. అష్టైశ్వర్యాలు ప్రాప్తించవు. కానీ శనివారం నాడు ఇలా జరిగితే మాత్రం సంతోషంతోపాటుగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

if you see these on saturday then you will get boon from shani dev

శనివారం ఉదయాన్నే ఎవరైనా వ్యక్తులు భిక్షాటన చేస్తూ కనపడినట్లయితే దానిని శుభంగా పరిగణించాలి. ఎవరైనా యాచకులు శనివారం పూట ఇంటికి వస్తే అదృష్టంగా భావించాలి. అలాంటప్పుడు మీరు వారికి తగినంత సహాయం చేయాలి. శనివారం నాడు ఇంటి చుట్టుపక్కల ఎవరైనా తుడిచే వాళ్ళు కనబడితే అది కూడా శుభంగా భావించాలి. వాళ్లకి ఎంతోకొంత ఆరోజు ఇచ్చి పంపించాలి.

ఇలా చేయడం వలన మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. శని దేవుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. చాలామంది నల్లని వస్తువులు కనపడితే అశుభంగా భావిస్తారు. శని దేవుడికి నలుపు రంగు ప్రీతికరమైనది. శనివారం నాడు నల్ల కుక్క కనపడితే మీకు మంచి జరగబోతున్నట్లు మీరు భావించాలి. వాటికి ఆహారాన్ని ఇవ్వాలి. ఆవ నూనెతో చేసిన రొట్టెని శనివారం పూట నల్లని కుక్కకి ఇస్తే చాలా మంచి కలుగుతుందట. మీకు వ్యాపారంలో, ఉద్యోగంలో, ఉపాధిలో లేదంటే వాణిజ్యరంగంలో అయినా కీర్తి చేకూరాలంటే శని దేవుడి అనుగ్రహం కచ్చితంగా ఉండాలి.

Admin

Recent Posts