ఆధ్యాత్మికం

ఈ ఆల‌యంలో నిరంత‌రం మంటలు వ‌స్తూనే ఉంటాయి తెలుసా..? ఎక్క‌డ ఉందంటే..?

ప్రపంచం మొత్తం మీద ఎన్నో అతి పురాతన ఆలయాలు, అద్భుత శిల్పకళానైపుణ్యం ఉన్న ఆలయాలు ఉన్నట్టే, ఇప్పటికి ఎవరికీ అర్ధం కానీ కొన్ని అద్భుత ఆలయాలు ఉన్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశ్, కాంగడాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న‌ జ్వాలాముఖి ఆలయం కూడా ఒక‌టి. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనను తను దహించివేసుకుంద‌నీ, అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమ్మీద పడిందనీ చెబుతారు కదా. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొల్చుకుంటున్నాము.

మరికొందరేమో 51 ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు. వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి. జ్వాలాముఖి ఆలయంను జ్వాలజి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం జ్వాలాముఖి అనే హిందూ మత దేవతకు అంకితం చేయబడింది. ఇక్కడ అమ్మవారు జ్వాలా రూపంలో ఉండటం వల్ల‌ అమ్మవారికి జ్వాలాముఖి అనే పేరు వచ్చినది అని చెబుతారు. ఇక్కడ తొమ్మిది జ్యోతులు ఎప్పుడు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి.

jwalamukhi temple himachal pradesh know the speciality

ఈ ఆలయంలో ఇలా తొమ్మిది జ్వాలలు ఎలాంటి సహాయం లేకుండా ఎలా వెలుగుతున్నాయనే విషయాన్నీ తెలుసుకోవడానికి ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ ఆ మిస్టరీ ఏంటనేది ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. ఈ ఆలయంలో అరకు కింద చిన్న గుంట ఉండగా, ఆ గుంట పక్కన ఉన్న చిన్న రంధ్రం నుండి అరచేతి మందంతో ఒక జ్వాల‌ నిరంతరం వెలుగుతుండగా, ఆ జ్వాల‌ సతీదేవి యొక్క నాలుక రూపం అని చెబుతారు. దీని వెనుక ఏదో కుట్ర దాగుందని అనుమానించినవారు భంగపడకా తప్పలేదు.

మొగల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా, మంట మీదకు నీటిని మళ్లించడం ద్వారా… నిప్పుని ఆర్పే ప్రయత్నం చేశారట. కానీ ఆ ప్రయత్నాలన్నీ వృధా అవడంతో, జ్వాలాముఖి అమ్మవారి మహిమను తల్చుకుంటూ వెనుదిరగక తప్పలేదు. అయితే అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు.

Admin

Recent Posts