హెల్త్ టిప్స్

ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే ఇలా చేయాల‌ట‌.. డాక్ట‌ర్ చెప్పిన ట్రిక్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రపోవడం అనేది చాలా మందికి పెద్ద సమస్య&period; సరైన సమయానికి నిద్రరావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు&period; కానీ నిద్రరాక సతమతమవుతుంటారు&period; మన జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగానే నిద్రపోవడం అనేది ఇబ్బందిగా మారింది&period; అనవసర టెన్షన్లు&comma; ఒత్తిళ్ళు&comma; రాత్రిపూట పనిచేయడాలు మొదలైనవి జీవన చక్రాన్ని మారుస్తున్నాయి&period; దానివల్ల మన శరీరానికి అలవాటు తప్పిపోతుంది&period; అందుకే ఏది ఏ టైమ్ లో చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐతే నిద్రకోసం కొన్ని రకాల టిప్స్ పాటించమని చాలా మంది చెబుతుంటారు&period; అలాంటి ఒక టిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period; ఒకానొక డాక్టర్ తెలిపిన ఈ టిప్ నిద్ర పట్టడానికి బాగా ఉపయోగపడుతుందని వినిపిస్తుంది&period; దీనికోసం మీరేమీ పెద్దగా కష్టపడనక్కరలేదు&period; ఏవేవో ఆహారాలు&comma; వ్యాయామాలు చేయనక్కరలేదు&period; కానీ ఒక జత సాక్స్ ఎక్స్ ట్రా కొనుక్కుంటే సరిపోతుంది&period; ఏంటీ&quest; నిద్రపోవడానికి సాక్సులకి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా&quest; అదే మరి కిటుకు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79564 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;sleep-5&period;jpg" alt&equals;"wear socks on bed for good night sleep " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రపోయే ముందు కాళ్ళకి సాక్సులు వేసుకుంటే హాయిగా నిద్రపడుతుందట&period; సాక్సుల వల్ల అరికాళ్ళలో వెచ్చదనం పుట్టి&comma; నిద్రలోకి జారుకునేలా చేస్తాయని డాక్టర్ చెబుతున్నాడు&period; దీనివల్ల నిద్ర తొందరగా వస్తుందని&comma; ఈ టిప్ ని తాను ఒకానొక సర్వే నుండి కనుగొన్నానని తెలిపాడు&period; ఈ విషయమై కొందరు నెగెటివ్ వ్యాఖ్యలు చేస్తున్నారు&period; సాక్సులు వేసుకుని నిద్రపోతే దాని వాసనకి నిద్ర దూరమవుతుందే కానీ నిద్రపోవడం అసంభవమని అంటున్నారు&period; మరికొందరేమో అది నిజమే అని సాక్సుల వల్ల నిద్ర తొందరగా పడుతుందని&comma; మేము కూడా అలా ట్రై చేసామని అంటున్నారు&period; మరి ఇది నిజమో కాదో తెలుసుకోవాలనుందా&quest; ఐతే మీరూ ట్రై చేయండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts