ఆధ్యాత్మికం

రోజు రోజుకీ పెరిగిపోతున్న హ‌నుమంతుడు ఉన్న ఆల‌యం ఇది.. ఎక్క‌డ ఉందంటే..?

తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ది. ఈ ఆలయానికి కొన్ని వేలసంవత్సరాల చరిత్ర అనేది ఉండగా, అతిపురాతన ఆలయంగా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిచెందింది. ఇక్కడ నిలువెత్తు ఆంజనేయ స్వామి దాదాపు 20 అడుగుల ఆంజనేయ విగ్రహంతో ఉండటం వల్ల బాగా ప్రసిద్ది చెందాడు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఆంజనేయస్వామి ఎదురుగా ఉన్న ల‌క్ష్మీ నరసింహ స్వామికి చేతులు జోడిస్తూ దాస్యభావాన్ని ప్రకటిస్తున్నాడు.

ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు. ఎందుకంటే ఈ ఆలయంలో స్వామి విగ్రహం ఎత్తు రోజు రోజుకూ పెరుగుతోందని అంటారు. ఒకప్పుడు ఈ ఆలయ గర్భగుడికి పైకప్పు నిర్మించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ వేసిన కప్పు వేసినట్టుగానే కూలిపోయాయని చెబుతున్నారు ప్రధాన అర్చకులు. ఈ విగ్రహం స్వయంభువు అయినందునే రోజురోజుకూ పెరుగుతూనే ఉంద‌ని..అందువల్లే పైన కప్పు వేయడానికి వీలుకాలేదని ఆలయ కథనం. నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈయన్ను దర్శించుకుంటారు

namakkal hanuman temple know where it is namakkal hanuman temple know where it is

ఈ దేవాలయం సుమారు 1500 ఏళ్ల నాటిది. నామక్కల్ కోట దిగువ భాగంలో ఈ గుడి ఉంది. నరసింహ స్వామి ఆలయానికి సుమారు వంద మీటర్లు ఎదురుగా ఉంటుంది ఈ గుడి. ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహమే. ఆంజనేయుడు దిగంబర దేవాలయంలో (ఆకాశం పైకప్పుగా) లక్ష్మీ నృసింహ స్వామి మరియు సాలగ్రామం వైపు తిరిగి కొలుస్తూ ఉంటాడు.

Admin

Recent Posts