ఆధ్యాత్మికం

Acharya Chanakya : ల‌క్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండేందుకు ఆచార్య చాణ‌క్యుడు చెప్పిన విష‌యాలు..!

Acharya Chanakya : ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది బాధ పడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాలంటే, కొంచెం కష్టమైంది కానీ ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడడానికి కొన్ని రకాల పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని, ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితంలో ప్రతి సమస్యకు కూడా చక్కటి పరిష్కారం దొరుకుతుంది.

ఆచార్య చాణక్య లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ లభించాలంటే ఇలా చేయాలని తెలియజేశారు. ఆర్థిక ఇబ్బందులు, భార్యా భర్తల మధ్య ఇబ్బందులు, స్నేహితుల మధ్య సమస్యలు ఇలా లైఫ్ లో ఎదురయ్యే ప్రతి దాని గురించి కూడా ఎంతో చక్కగా వివరించారు చాణక్య. అయితే డబ్బుకి కొరత లేకుండా ఉండాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం ఎంతో ముఖ్యమైనది అని చాణక్య అన్నారు.

lakshmi devi will stay in your home if you follow these

ఒకరినొకరు భార్యాభర్తలు ప్రేమించుకోవడం వలన లక్ష్మీ దేవి మీ ఇంట్లో ఉంటుంది. అది ఎలా అంటే.. భార్యని ఇంటి లక్ష్మి అంటారు. భార్యను గౌరవించడం చాలా ముఖ్యం. అప్పుడు డబ్బుకి కొరత ఉండదు. గురువులని, పండితుల్ని కూడా గౌరవించాలి. లక్ష్మీ కటాక్షం ఎక్కువ ఉంటుంది.

ఏ ఇంట్లో సాధువులు సేవిస్తారో, ఆ ఇంట్లో సంపదకి డబ్బుకి లోటు ఉండదు. అలానే అన్నాన్ని అన్నపూర్ణేశ్వరి అంటారు. అన్నాన్ని కూడా గౌరవించాలి. అతిథులు ఇంటికి వస్తే బాధపడకూడదు. వాళ్ళు ఇంటికి వస్తే అభినందించి సత్కరించాలి. ఇలా ఏ ఇంట్లో అయితే అతిధుల్ని గౌరవిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది.

Admin

Recent Posts