ఆధ్యాత్మికం

Deepam : దీపం ఇలా పెడితే చాలు, మీరు చేసే ప‌నుల్లో ఆటంకాలు ఎదురు కావు..!

Deepam : ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం. కానీ చేరుకోవడానికి అనేక అవాంతరాలు, ఆటంకాలు. వీటిని అధిగమించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చేయలేని పరిస్థితి. గ్రహదోషాలు, పూర్వజన్మకృతాలు, గోచారం, వాస్తు ఇలా అనేక కారణాలు కావచ్చు. కానీ అవి తెలియక వాటి పరిష్కారాలకు డబ్బు ఖర్చుచేసి జేబులు ఖాళీ చేసుకుంటుంటారు. కానీ వీటన్నింటికంటే చాలా శక్తివంతమైనది, పండితులు చెప్పే అతి సులభమైన పరిష్కారం తెలుసుకుందాం.

దీపం పెట్టడం అంటే జ్ఞానాన్ని వెదకడం అని పెద్దలు చెప్తారు. బాహ్యదీపం పెట్టడం నుంచి అంతరంలో దీపం వెలిగించుకోవడం దీని లక్ష్యం. ప్రసుత్తం సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్న వృక్షం రావిచెట్టు. దీన్నే అశ్వత్థ వృక్షం అని కూడా అంటారు. ఈ చెట్టుకు ఆధ్యాత్మికతలో అనేక రహస్యాలు దాగిఉన్నాయి. వాటిలో ఒకటి తెలుసుకుందాం. రావిచెట్టు విశేషాలతో కూడుకున్నది. పూర్వ జన్మ కర్మలను ఈ రావిచెట్టు తొలగించగలదు. అదేవిధంగా శాపాలు, దోషాలను గ్రహపీడలను నివారించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా రావిచెట్టును పూజించడమే.

put deepam like this you will never get obstacles in your work

అంతేకాకుండా ఇంట్లో రావిచెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప, దోష కర్మ ఫలితాలు వుండవు. పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. రావిచెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. రావి ఆకులను భగవత్ స్వరూపంగా భావించి, విష్ణునామస్మరణ అంటే ఓం నమో భగవతే వాసుదేవాయనమః అనే మంత్రాన్ని పఠిస్తూ దీపం పెడితే చాలు కొన్ని వారాలలో మీకు మంచి ఫలితాలు కన్పిస్తాయి.

Admin

Recent Posts