ఆధ్యాత్మికం

దేశంలోనే అత్యంత విశాల‌మైన కోనేరు క‌లిగిన ఆల‌యం ఇది.. ఎక్క‌డంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా శివాలయాల్లో శివుడికి ఎదురుగా ఆయన వాహనం నంది కూర్చుని ఉంటుంది&period; కానీ ఇక్కడ నంది స్వామి పట్ల తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటుంది&period; ఇక్కడి మరకత లింగ అభిషేకం నేత్రానందం కలిగించేది ఉంటుంది&period; ఆరు కాలాలలో ఇక్కడి శివుడికి ఆరాధన జరుగుతుంది&period; ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం&period;&period; తమిళనాడు లోని అత్యంత పురాతన ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి&period; ఇది తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం&period; ఈ ఆలయాన్ని కమలాపురం అని కూడా పిలుస్తారు&period; ఈ ఆలయంలో ప్రముఖంగా త్యాగరాజేశ్వరుడు కొలువై ఉన్నాడు&period; పురాణాల ప్రకారం ఈ ఆలయ విశిష్టతను ప్రస్తావించే సందర్భంలో ముఖ్యమైన దైవ స్వరూపాలుగా ఉన్న వాల్మీకేశ్వరుడు&comma; సోమాస్కంద మూర్తి&comma; కమలాంబికల గురించి కూడా విశేషంగా పేర్కొన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురాణ గాథాల ప్రకారం ఒక సారి రాక్షసులకు&comma; ఇంద్రునికి మధ్య యుద్దం సంభవించింది&period; ఆ సమయంలో ఇంద్రునికి ముచికుందుడు సహాయం చేశాడట&period; అందుకు ప్రతి ఫలంగా ముచికుందుడు ఇంద్రుడు పూజించే సోమాస్కంద మూర్తిని కావాలని కోరుతాడు&period; సోమాస్కంద మూర్తిని మొదట విష్ణువు కొంతకాలం పూజించి తర్వాత దాన్ని ఇంద్రునికి ఇస్తాడు&period; అయితే ఆ విగ్రహాన్ని ముచికుందుడుకు ఇవ్వడానికి ఇష్టపడని ఇంద్రుడు రాత్రికి రాత్రి దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి ఆ మూర్తిని అచ్చంగా పోలి ఉండే మరో ఆరు మూర్తులను తయారుచేయిస్తాడు&period; అయితే ముచికుంద శివుని అనుగ్రహంతో అసలు మూర్తిని గుర్తించడంతో ఇంద్రుడు ఆ సోమాస్కంద మూర్తిని ముచికుందకు ఇవ్వక తప్పలేదు&period; అలా పొంది పూజించిన సోమాస్కందమూర్తినే ముచికుందుడు తిరువారూర్‌లో ప్రతిష్టించాడు&period; ఈ మూర్తినే వీధి విడంగర్ అని పిలుస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79441 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;thyagaraj-swamy-temple&period;jpg" alt&equals;"the lake in this temple is very big know it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆలయంలో కనిపించే కొలనునే కమలాలయం అని పిలుస్తారు&period; ఇది అతి విశాలమైన సుందరమైనదిగా దర్శనమిస్తుంది&period; ఈ కోనేరు ఆలయమంత పెద్దది&comma; ముప్పై మూడు ఎకరాలలో విస్తరించి ఉంది&period; దేశంలోనే అతి పెద్దదిగా ప్రసిద్ది చెందినది&period; మహాలక్ష్మీ విష్ణువును వివాహమాడాలని ఇక్కడి మూలస్థానేశ్వరుని ఉద్దేశించి తపస్సు చేసింది&period; అందుకే ఇక్కడి కోనేరుకు కమలాలయం అని పేరు వచ్చింది&period; కొలను మధ్యలో నాదువన నాథుని ఆలయం కూడా ఉంటుంది&period; ఇక్కడి ప్రదోష అభిషేకం చాలా విశేషంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts