Death Person Items : మనిషి పుట్టిన తరువాత మరణించక తప్పదు. పుట్టుక, చావు అనేవి మన చేతుల్లో ఉండవు. అలాగే మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు ఎవరైనా చనిపోతే మనకు ఎంతో బాధ కలుగుతుంది. ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. ఈ బాధ వర్ణించలేనిది కూడా. ఇక ఆ మరణించిన వ్యక్తి వాడిన వస్తువులను మనం ఇతరులకు ఇచ్చేస్తూ ఉంటాము. దానం చేస్తుంటాము. కొందరు వారి గుర్తుగా ఆ వస్తువులను దాచి పెట్టుకుంటారు. కొందరు పడేస్తూ ఉంటారు. అయితే చాలా మందికి మరణించిన వ్యక్తులు వాడిన వస్తువులను ఏం చేయాలనే సందేహం వస్తూ ఉంటుంది. మరణించిన వారి వస్తువులు ఏది వాడినా వాడకున్న ఈ మూడు వస్తువులు మాత్రం అస్సలు వాడకూడదని శాస్త్రం చెబుతుంది. మరణించిన వారి యొక్క వాడకూడని ఈ మూడు వస్తువులు ఏమిటి.. అలాగే మరణించిన వ్యక్తుల వస్తువులను ఏం చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మరణించిన వారి ఆభరణాలను ఇతరులు వాడకూడదు. అది బంగారం, వెండి లేదా ఏ ఇతర లోహాలతో చేసిన ఆభరణాలైన సరే. వ్యక్తి మరణించినప్పటికి వారి ఆత్మకు ఆ ఆభరణాలపై మక్కువ ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఆ ఆభరణాలను ధరించిన వారికి వారి ఆత్మ అవహిస్తుందని నమ్ముతారు. ఒకవేళ ఈ ఆభరణాలను తిరిగి వాడుకోవాలి అంటే వాటిని కరిగించి వాటితో కొత్త ఆభరణాలు తయారు చేసి వాడుకోవాలి. మరణించిన వారి ఆభరణాలు కరిగించి కొత్తగా తయారు చేసి ధరిస్తే ఎటువంటి దోషం ఉండదు. ఒకవేళ వ్యక్తి మరణించడానికి ముందు ఆభరణాలను కనుక మీకు ఇస్తే ఆ వ్యక్తి మరణించిన తరువాత కూడా ఆ ఆభరణాలు మీరు ధరించవచ్చు. ఆ ఆభరణాలను ధరించడం వల్ల ఆ వ్యక్తి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి. అలాగే వ్యక్తులకు ఆభరణాల తరువాత మక్కువ ఉండేది దుస్తులపై. కనుక మరణించిన వ్యక్తుల దుస్తులను కూడా ధరించవద్దు. మరణించిన వారి దుస్తులను దానం చేయాలి. ఇలా దానం చేయడం వల్ల వారి ఆత్మకే మోక్షం కలుగుతుంది. దానం ఇవ్వకుండా మరణించిన వారి వ్యక్తుల దుస్తులను కనుక ధరిస్తే వారి ఆత్మ దుస్తులను ధరించిన వారిని ఆవహిస్తుందని గరుడ పురాణం చెబుతుంది. కనుక మరణించిన వారి దుస్తులను దానం చేయడం మంచిది.
అలాగే మరణించిన వారి చేతి గడియారాలను కూడా వాడవద్దు. మరణించిన వారి సానుకూల మరియు ప్రతికూల శక్తులు వారి గడియారంలో ఉంటాయని నమ్ముతారు. మరణించిన వారి గడియారాలు ధరించడం వల్ల దానిలో ఉండే ప్రతికూల శక్తికి గడియారం ధరించిన వారు బలి అవ్వాల్సిందేనని శాస్త్రం చెబుతుంది. ఈ విధంగా మరణించిన వారి యొక్క ఈ మూడు వస్తువులను ఉపయోగించడం మంచిది కాదని వీటిని ఉపయోగిస్తే మరణించిన వారి ఆత్మకు మోక్షం ఉండదని గరుడ పురాణం చెబుతుంది. ఈ మూడు వస్తువులపై మరణించిన వారికి మక్కువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు వాటిని మరలా సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారని గరుడ పురాణం చెబుతుంది. అలాగే చనిపోయిన వారికి ఎక్కువగా ఇష్టం ఉండే ఇతర వస్తువులను కూడా బ్రతికి ఉన్నవారు వాడకపోవడమే మంచిదని శాస్త్రం చెబుతుంది.