ఆధ్యాత్మికం

Naraghosha : న‌ర‌ఘోష ఉంద‌ని చెప్పే సంకేతాలు ఇవే.. ఇలా చేయండి..!

Naraghosha : ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఏదో కారణంగా, సమస్య కలుగుతుంది. సమస్యలు ఏమి లేకుండా ఆనందంగా ఉండాలంటే, కచ్చితంగా పండితులు చెప్పే విషయాలని కూడా పాటిస్తూ ఉండాలి. చాలామంది నర దిష్టి తగిలిందని అంటూ ఉంటారు. మీరు కూడా అలా చెప్పడాన్ని వినే ఉంటారు. నరదృష్టి వల్లే మీరు కూడా ఇలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని.. మీరు అనుకున్నట్లయితే.. కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాలి.

నరదిష్టి ఉందని తెలియజేసే సంకేతాలు తో పాటు, ఇది తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నరగోష కారణంగా చాలామంది పీడింపబడుతున్నారు. చాలామందికి నరగోష ఉంటుంది. దీనిని ఎలా గుర్తించాలంటే.. ఎక్కువగా నరగోష తగిలేవాళ్లు ఎప్పుడు చూసినా ఆవలింతలు తీయడం, ఎక్కువ సేపు నిద్రపోవడం వంటివి చేస్తారు. ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లు వుంటారు.

these signs tell that naraghosha is there in home

కొంతమంది అందర్నీ ఆకట్టుకునే విధంగా కనబడుతుంటారు. అటువంటి వాళ్ళు ఇంటికి వచ్చేసరికి కూలబడి పోతూ ఉంటారు. ఇలా చాలామందికి చాలా సార్లు జరిగే ఉంటుంది. అయితే నరగోష తగలకుండా ఉండడానికి కూడా మార్గం ఉంది. కాటుకని అరికాళ్ళకి పెట్టుకోకూడదు. చాలామంది దిష్టి వంటివి తగలకూడదని అరికాళ్ళలో కాటుక పెట్టుకుంటారు. అది తప్పు.

నరగోష పోవాలంటే బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఇలా చేయండి. రాళ్ల ఉప్పు తో ఒకసారి దిష్టి తీసేసి నీళ్లతో పాటుగా పచ్చని మొక్కల పోసేస్తే సరిపోతుంది. ఎవరు తొక్కని చోట ఈ రాళ్ల ఉప్పుని దిష్టి తీసి పోసేయాలి. అలా చేయడం వలన నరగోష పూర్తిగా పోతుంది. నరగోష వలన ఎలాంటి బాధ కూడా మీకు ఉండదు. నరదృష్టి లేకుండా ఉండాలంటే అరికాళ్ళకి కాటుక కాదు. మసి రాసుకోండి. ఏదైనా మసి రాసుకుంటే నర దిష్టి తగలదు.

Share
Admin

Recent Posts