Cloves : మనం వంటల తయారీలో లవంగాలను ఉపయోగిస్తూ ఉంటాం. వీటిని ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇవే కాకుండా లవంగాలను ఉపయోగించి మనం ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా బయటపడవచ్చు. ఎంత కష్టపడినా కూడా ఫలితం కనిపించనప్పుడు, మనం చేసే పనిలో ధన లాభం కలగాలన్నా, ఇంట్లో ధనానికి కొదువ ఉండకూడదు అన్నా.. లవంగాలతో ఈ విధంగా చేయాలి.
ఈ నియమాన్ని పూర్తి నమ్మకంతో, ఎవరికీ తెలియకుండా చేయాలి. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందడానికి లవంగాలను ఏవిధంగా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పడు తెలుసుకుందాం. లక్ష్మీ దేవి కటాక్షాన్ని పొందడానికి గాను సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి బయట, లోపల శుభ్రం చేసి తలస్నానం చేయాలి. తరువాత ఒక ఎర్రని వస్త్రాన్ని, ఒక లవంగాన్ని తీసుకుని లక్ష్మీ దేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి పూజించాలి. ఇప్పుడు లక్ష్మీ దేవిని మనసులో తలుచుకుంటూ పూర్తి నమ్మకంతో ధనలాభం, సిరిసంపదలు కలగాలని మనసులో కోరుకుంటూ ఆ లవంగాన్ని ఎర్రటి వస్త్రంలో ఉంచి మూటకట్టాలి.
![Cloves : లవంగాలతో ఇలా చేస్తే.. ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి.. డబ్బుకు లోటు ఉండదు..! use Cloves in this way to get rid of money problems](https://ayurvedam365-com.in9.cdn-alpha.com//opt/bitnami/wordpress/wp-content/uploads/2022/06/cloves-money.jpg)
ఆ వస్త్రాన్ని మనం ఇంట్లో ధనం దాచే చోట ఉంచాలి. ఈ విషయాన్ని మరో మనిషితో చెప్పకుండా చేయాలి. అప్పుడే ధన లాభం, సిరి సంపదలు కలుగుతాయి. ఈ విషయాన్ని ఎరితోనైనా చెబితే ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. లవంగాలతో ఈ విధంగా చేయడం వల్ల వ్యాపారంలో లాభం కలుగుతుంది. ఇంట్లో సిరి సంపదలు, ఐశ్వర్యం వృద్ధి చెంది ఆనందంగా ఉంటారు. లవంగాలతో ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు.