ఆధ్యాత్మికం

Bell In Temple : ఆల‌యంలో గంట‌ను ఎందుకు కొట్టాలి.. అస‌లు దాంతో ప్ర‌యోజ‌నం ఏంటి..?

Bell In Temple : మన దేశ‌ సంస్కృతిలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత గోచరిస్తుంది. దీనిలో భాగంగా ఒక్కో సంప్రదాయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. సహజంగా భారతీయ సంస్కృతిలో ఎక్కడ చూసినా దైవారాధనకు ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. మనం ఏ దైవ క్షేత్రానికి వెళ్ళినా మనకు మొదటిగా కనపడేది గంట. దేవాలయంలో గంటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గుడిలో హారతి సమయంలో, ప్రత్యేకమైన కైంకర్యాలు జరిగే సమయంలో గంట కొడతారు. అసలు దేవాలయంలో గంట ఎందుకు కొడతారు.. అనే విష‌యం మనలో చాలా మందికి తెలియదు. గుడిలోకి వెళ్ళగానే ప్రదక్షిణలు చేసిన తరువాత గంట కొట్టి దేవుడిని దర్శించుకుంటాం. అయితే ఆలయంలో కొట్టే గంటకు ఒక అర్థం, పరమార్థం ఉన్నాయి.

దేవుని ముందు గంట కొట్టడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న దుష్ట శక్తులను, వ్యతిరేక‌ కిరణాలను దూరం చేస్తుంది. అంతే కాకుండా దేవుడి ముందు తమ కోరికను చెప్పుకుని గంట కొట్టడం ద్వారా ఆ కోరిక నెరవేరుతుంద‌ని భక్తుల నమ్మకం. గంట మోగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఇళ్ళల్లో కానీ, దేవాలయాల్లో కానీ హారతి సమయంలో గంటను మోగిస్తే మనసుకి ప్రశాంతంగా ఉండి ఆధ్యాత్మికత వైపు మళ్ళిస్తుంది. గంట యొక్క ఇంకో ప్రత్యేకత ఏమిటంటే గంటను సకల దేవతా స్వరూపంగా భావించి ముందుగా గంటను కొడతారు. గంటలో ఒక్కో భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.

what are the benefits of ringing bell in temple

గంట నాలుక భాగంలో సరస్వతీ దేవి కొలువై ఉంటుంద‌ని, ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, పొట్ట భాగంలో రుద్రుడు, కొన భాగంలో వాసుకి, పిడి భాగంలో గరుడ, చక్ర, హనుమ‌, నందీశ్వరులు ఉంటార‌ని పురాణాలు చెబుతున్నాయి. హారతి సమయంలో అందరు దేవుళ్ళను ఆహ్వానిస్తూ గంటను మోగిస్తారు. అందుకే హారతి సమయంలో కళ్ళు మూసుకోవద్దని పురోహితులు చెబుతుంటారు. ఇక కంచు గంట మోగించినపుడు దానిలో నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుంది. ఈ ఓంకార నాదం వినడం వల్ల మనిషిలో ఉన్న చింతలు, సమస్యలు తొల‌గిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. అందుక‌నే ఆల‌యాల్లో గంట‌ను ఉప‌యోగిస్తున్నారు.

Admin

Recent Posts