ఆధ్యాత్మికం

పౌర్ణమి రోజు కలకండను కామాక్షి దీపంలో వేసి పూజిస్తే..?

సాధారణంగా మన హిందువులు పౌర్ణమి వంటి కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఎంతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే పౌర్ణమి అమావాస్య వంటి రోజులలో కొన్ని చిట్కాలను పాటిస్తే పూజ చేయటం వల్ల వారి ఇంట్లో సంపదకి కొదువు ఉండదని భావిస్తుంటారు. అందువల్ల పౌర్ణమి వంటి రోజులలో కొన్ని చిట్కాలను పాటించడం వల్ల సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుందని భావిస్తారు.

ఈ సమయంలోనే పౌర్ణమి రోజు డైమండ్ ఆకారంలో ఉన్నటువంటి కళకండను తీసుకుని కామాక్షి దీపంలో వేసి దీపం వెలిగించడం ద్వారా మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అయితే కొందరికి పౌర్ణమి రోజుల్లో ఈ విధంగా చేయడం కుదరకపోతే మంగళ ,శుక్ర వారాలలో కూడా ఈ విధమైనటువంటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చునని పండితులు తెలియజేస్తున్నారు.

what happens if you lit kamakshi deepam with kalakand

సంపదకు అధిపతి అయిన కుబేరుడిని అనుగ్రహం మనపై కలగాలంటే తప్పనిసరిగా పౌర్ణమి వంటి రోజులలో కుబేరుడికి ప్రత్యేక పూజలు చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. కుబేరుడి అనుగ్రహం పొందాలంటే కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఊరగాయలను మన ఇంట్లో నిల్వ చేసుకోవడం వల్ల కుబేరుడు ఎంతో ప్రీతి చెంది మనకు సంపదలను ప్రసాదిస్తాడని పండితులు తెలియజేస్తున్నారు. అదే విధంగా పౌర్ణమి వంటి రోజులలో కుబేరుడికి ఊరగాయను సమర్పించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.

Admin

Recent Posts