ఆధ్యాత్మికం

Guava As Naivedyam : జామ పండ్ల‌ను నైవేద్యంగా పెడితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Guava As Naivedyam : దేవుడికి మనం నిత్యం పూజ చేస్తూ ఉంటాం. పూజ చేసినప్పుడు దేవుడికి పూలు, పండ్లు పెడుతూ ఉంటాం. నైవేద్యంగా కొన్ని పండ్లను దేవుడికి పెడుతూ ఉంటాం. అయితే దేవుడికి పండ్లను నైవేద్యం పెట్టినప్పుడు చాలామంది జామపండుని, ద్రాక్ష పండ్లను ఇలా ఏ పండు ఉంటే ఆ పండ్లని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అయితే పూజా కార్యక్రమంలో నైవేద్యం పెట్టడం వలన గౌరవ మర్యాదలతోపాటు సిరిసంపదలు కూడా పెరుగుతాయని జ్యోతిష నిపుణులు అంటున్నారు.

దేవుడికి నైవేద్యంగా ద్రాక్ష పండ్లను పెట్టి పేదవారికి దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయం అవుతాయట. అలాగే వీటిని ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు లేదంటే పెద్దలైనా తినొచ్చు. ఇలా చేయడం వలన సుఖ శాంతులు కలుగుతాయి. అలానే దేవుడికి నైవేద్యంగా జామ పండ్లను పెడితే మంచి సత్కారాలని పొందుతారు. వినాయకుడికి జామ పండ్లను నైవేద్యంగా పెడితే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉండవు.

what happens if you put jama pandu as naivedyam what happens if you put jama pandu as naivedyam

గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత సమస్యలు దూరం అవుతాయని జ్యోతిష నిపుణులు అంటున్నారు. జామకాయలని మనం దేవుళ్ళకి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. నైవేద్యంగా పెట్టిన ఆ పండ్లను సుమంగళులకు అందిస్తే షుగర్ వ్యాధి తగ్గుతుంది. పెళ్లి కాని అమ్మాయిల చేత పూజ చేయించి ముత్తైదువులకు జామ పండ్లతో తాంబూలం ఇస్తే మంచి వరుడు వస్తాడని పండితులు అంటున్నారు.

గౌరీ పూజకి నైవేద్యంగా ఉంచి పూజించిన జామ పండ్లని తినడం వలన మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు. కోరికలు కూడా నెరవేరుతాయి. దుర్గాదేవికి జామ పండ్లు నైవేద్యంగా పెట్టి, పిల్లలున్న వాళ్లకి ఇస్తే సంవత్సరంలో వాళ్లకి సంతానం కలుగుతుంది. ఇలా ఈ విధంగా పాటించడం వలన సమస్యలేమీ లేకుండా ఉండొచ్చు.

Admin

Recent Posts