Gods In Dreams : మనకి ప్రతి రోజూ ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. అయితే రాత్రి నిద్ర పోయినప్పుడు ఒక్కొక్కసారి వచ్చే కలలు గుర్తుంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏ కల వచ్చిందో కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు ఆనందాన్ని ఇచ్చేవి వస్తాయి. ఆనందంగా ఇష్టమైన వాళ్ళతో గడపడం, లేదంటే కలలో దేవుళ్ళు కనపడటం ఇలాంటివి వస్తుంటాయి.
చాలామందిలో ఉండే సందేహం ఏంటంటే కలలో దేవుళ్ళు కనపడచ్చా..? కనపడితే ఏమవుతుంది అని.. మరి ఇక ఈరోజు కలలో దేవుళ్ళు కనబడితే మంచిదా కాదా..? ఒకవేళ కనపడితే ఏం జరుగుతుంది, అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కలల్లో చాలా రకాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లకి తరచూ ఏదో కల వస్తుంది. ముఖ్యంగా అజీర్తి సమస్యలు ఉన్న వాళ్లకి భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. చింత వల్ల కొన్ని రకాల కలలు వస్తూ ఉంటాయి.
ఒకే విషయం గురించి పదే పదే బాధపడడం వలన ఆ కలలు మనకి నిద్రలో వస్తూ ఉంటాయి. కొన్ని కలలు యాదృచ్ఛికంగా వస్తాయి. అనారోగ్య సమస్య వలన కానీ ఎక్కువ ఆలోచించడం వలన కానీ రావు. ఇటువంటి కలలు సహజంగా నిజం అవుతూ ఉంటాయట. అయితే కలలో దేవుళ్ళు కనపడితే ఏం జరుగుతుంది అనే విషయానికి వచ్చేస్తే.. కలలో దేవతలు కానీ ఎవరైనా దేవుడు కానీ కనపడితే చెడు వంటివి ఏమీ జరగవు.
అంతా మంచే జరుగుతుంది. దేవుడు కలలో కనపడితే హాని ఏమీ లేదు. ఇంకా మంచిదే అని చెప్పొచ్చు. కలలో దైవం కనపడితే దానిని ఆశీర్వాదం కింద స్వీకరించాలి. దైవరూపం కానీ దేవుడు విగ్రహం కానీ కలలో కనపడితే శుభ సూచకమే తప్ప దాని వలన ఎలాంటి నష్టం కూడా కలగదు. ఎలాంటి సమస్యలు రావు. ఏ చింతా ఉండదు.