ఆధ్యాత్మికం

ఏ శివాల‌యంలోకి వెళ్లి ద‌ర్శ‌నం చేసుకుంటే ఎలాంటి మంత్రాన్ని ప‌ఠించాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి&period; అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే&comma; ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై &lpar;పైకి&sol;ఆకాశంవైపు చూస్తూ&rpar; ఉంటుంది&period; 5 ముఖాల‌కి 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి&period; ఆ 5 ముఖాలలో నుండే సృష్టి&comma; స్థితి&comma; లయ&comma; తిరోదానము&comma; అనుగ్రహము యివ్వబడతాయి&period; అన్ని ముఖాలు పూజనీయమైనవే&period; అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు&period; శివాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి&period; పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది&period; అలా శివలింగానికి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమంవైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని సద్యోజాత శివలింగం అని అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు&comma; ఓం సద్యోజాత ముఖాయ నమః అని స్మరించుకోవాలి&period;శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం&period; శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటే&comma; అటుంటి శివలింగాన్ని తత్పురుష ముఖం అని అంటారు&period; తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు మీద అధిష్ఠానం కలిగి ఉంటాడు&period; తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది&period; అంటే చీకటిలో ఉంచటం&period; అది మనల్ని మాయ చేత కప్పి బడేస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది&period; ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాము&period; ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ తత్పురుష ముఖం&period; తత్పురుష ముఖం పూజించ తగినదే&period; ఏ మాత్రం అనుమానం లేదు&period; మనల్ని రక్షించినా&comma; శిక్షించినా అన్నీ ఆ పరమేశ్వరుడేగా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79813 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;shiv-ling-3&period;jpg" alt&equals;"which mantra we have to read in which shiva temple " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివలింగం దక్షిణంవైపు చూస్తూ ఉంటే అటువంటి ముఖం దక్షిణామూర్తి స్వరూపం&period; మనకు శివాలయంలో దక్షిణంని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉండి తీరాలి&period; అసలు దక్షిణామూర్తి విగ్రహం లేకుండా శివాలయాలు కట్టకూడదు&period; ఆ ముఖాన్నే అఘోర ముఖం అంటారు&period; ఈ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్ఠానం అయి ఉంటుంది&period; ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం&period; ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి&comma; మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు&period; మనకు మృత్యువుపట్ల భయం పోగొట్టేది&comma; మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉత్తరం వైపు చూసే ముఖాన్ని వామదేవ ముఖం అని అంటారు&period; ఇప్పటిదాకా 4 దిక్కుల్ని చూస్తున్న&comma; 4 దిక్కులా గురించి తెలుసుకోగలిగాం&period; ఇక చివరి ముఖం శివలింగంపైన &lpar;అంటే ఆకాశంవైపు చూస్తూ ఉండే ముఖం&rpar;ఉండే ముఖం&period; ఆ ముఖాన్ని ఈశాన ముఖం అంటారు&period; మనం లింగంపైన చూసి&comma; ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి&period; ఈశాన ముఖ దర్శనం మనం మిగిలిన నాలుగు ముఖాల్ని దర్శించిన తరువాతనే దర్శించాలి&period; అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది&period; మనకు కాశీలో ఉండే ముఖం అఘోర ముఖం&period; కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చుని&comma; దక్షిణంవైపు చూస్తూ ఉంటుంది&period; ఉత్తరం వైపు చూసి వాసుదేవ ముఖం నీటి మీద అధిష్ఠానం అయి ఉంటుంది&period; ఈ వాసుదేవ ముఖమే మనకు సమస్త మంగళము ఇచ్చే ముఖం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-79812" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;shiv-ling-1-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాసుదేవ ముఖం అంటే ఏమిటి అనేది మనకు శివపురాణంలో చెప్పబడింది&period; యదార్తమునకు అదే విష్ణు స్వరూపం&period; అందుకే విష్ణువు&comma; శివుడు ఒకరే … రెండు లేనే లేవు …&period; శివపురాణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికైనా సంశయం ఉంటే ఒకటి గమనించండి&period; శివపురాణంని రాసినది వేదవ్యాసుడు&period; వ్యాసుడే విష్ణువు … విష్ణువే వ్యాసుడు&period; వ్యాసాయ విష్ణు రూపాయ&comma; వ్యాస రూపాయ విష్ణవే&comma; నమో వైబ్రహ్మ విధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే … రెండు కాదు&period; చాలామంది వేరుగా చూస్తూ పొరబడుతున్నారు&period; కృష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను&period; మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను&period; ఈ వాసుదేవ ముఖాన్ని ఓం వాసుదేవాయ నమః అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts