Home Tips

ఓవెన్ కొనాల‌ని చూస్తున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..!

ఆహారాన్ని వేడి చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయోగ పడుతుంది ఓవెన్. క్షణాల్లో ఆహారం వేడిగా అయ్యి మన సమయాన్ని మిగులుస్తుంది. అంతే కాదు దీనిలో కొన్ని వంటలు కూడా వండుకోవచ్చు మరియు బేకింగ్ చేసుకోవచ్చు. అయితే ఓవెన్ ను నీళ్లతో కడగకూడదు, పొడి గుడ్డ తో మాత్రమే తుడవాలి. ఇంకా బాగా శుభ్రం చేయాలనుకుంటే బేకింగ్ సోడా మరియు వెనిగర్ కలిపి, ఈ మిశ్రమం తో శుభ్రం చేసుకోవచ్చు లేదా నిమ్మరసం కూడా వాడవచ్చు. ఇదే పద్ధతి ని గాజు డోర్ శుభ్రం చేయడానికి కూడా వాడవచ్చు. అన్ని మరకలు సులభంగా పోతాయి.

ఓవెన్ వేడిగా ఉంటే మూత తెరవకూడదు. ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత దానంతట అదే తెరుచుకొన్న తర్వాత నే ఆహారాన్ని బయటకు తీయాలి. ఓవెన్ ఆన్ చేసిన వెంటనే వాడకూడదు ఆన్ చేసి ఐదు నిమిషాలు అలానే ఉంచి, ఆ తర్వాతనే ఉపయోగించాలి. ఒక్కో మోడల్ కు ఒక్కో విధమైన పద్దతి ఉంటుంది. ఇలా తేడాలు ఉంటాయి కాబట్టి ఓవెన్ వాడే ముందు యూజర్ మాన్యువల్ తప్పక చూడాల్సిన అవసరం ఉంది.

if you are buying oven must know this

ఓవెన్ లో పదార్థాలను పెట్టిన తర్వాత మూత తెరవకూడదు, ఆహారాన్ని చూడాలనుకుంటే ట్రాన్స్పరెంట్ పొర నుండే చూడాలి.

Admin

Recent Posts